మెగా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!

‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.గోవిందుడు విడుదల కాగానే శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్‌ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.

 Mega Fans Disappointment With Charan – Srinu Vytla Movie..!-TeluguStop.com

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం అయ్యింది.ఇటీవలే ఈ సినిమా ప్రారంభం అయ్యింది.

షూటింగ్‌ ఆలస్యంగా మొదలైనా కూడా సినిమాను మాత్రం ఆలస్యం కాకుండా దసరా కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దానయ్య మరియు దర్శకుడు శ్రీనువైట్ల ప్రకటించారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకు ఈ సినిమా వచ్చే పరిస్థితులు లేవు అని తేలిపోయింది.

ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్‌కు అనేక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ నత్త నడకన జరుగుతుంది.

తాజాగా ప్రారంభం కావాల్సిన షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అయ్యింది.బ్యాంకాక్‌లో రామ్‌చరణ్‌ ఫైటింగ్‌లో శిక్షణ పూర్తి కాకపోవడంతో షూటింగ్‌ను వాయిదా వేయడం జరిగింది.

ఇక పలు కారణాలు కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం అవుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.దసరాకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వస్తాడని భావించిన మెగా ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube