తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలి లెక్కలే వేరు.ఇటు నందమూరి ఫ్యామిలి నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ అగ్రనటుల్లో ఒకరిగా ఉంటే, ఘట్టమనేని ఫ్యామిలి మొత్తానికి మహేష్ ఒక్కడే దిక్కు.
మరి మెగా ఫ్యామిలిని తీసుకుంటే, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ .నలుగురు స్టార్ డమ్ సంపాదించారు.కొత్తగా బరిలో దిగిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా దూసుకుపోతున్నారు.కాని ఒక చిత్రమైన విషయం ఏమిటంటే, అంతమంది హీరోలు ఉన్నా, మెగా ఫ్యామిలి సినిమాలు టాప్ 3 లో లేకుండాపోయాయి ఇప్పుడు.
తెలుగు వెర్షన్, డబ్బంగ్ వెర్షన్స్ కలిపి, ఇలా ఏ లెక్కన తీసుకున్నా, బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు టాప్ 2 లో ఉండగా, జనతా గ్యారేజ్ కూడా టాప్ 3 లోకి వచ్చేసింది.అంటే మొదటి మూడు చిత్రాలు రాజమౌళి/ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ నటించినవి అయితే, మెగాఫ్యామిలకిి సంబంధించిన ఒక్క సినిమా కూడా లేకుండాపోయింది.
మరి లెక్కలు త్వరలోనే మారతాయా అంటే మారొచ్చు.ఖైదీ నం.150తో మెగాస్టార్ టాప్ 3లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.కాని ఆ తరువాత మహేష్ 23 గనుక హిట్ అయితే, బాహుబలి రెండు భాగాలు, మహేష్ 23వ సినిమా టాప్ 3 స్థానాల్ని ఆక్రమించేస్తాయి.
ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఎలాగో ఉన్నాయి.అంటే ఇప్పుడు జనతా గ్యారేజ్ లేదా శ్రీమంతుడుని దాటి, మెగాఫ్యామిలిని కనీసం టాప్ 5లో ఉంచి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత పూర్తిగా చిరంజీవి మీదే ఉంది.