Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఆరేళ్లుగా మూత్రం తాగి బ్రతుకుతున్న వింత మనిషి-Meet The Man Who Has Been Surviving On His Pee For 6 Years

వినడానికి కొత్తగా మాత్రమే కాదు, చాలా చెత్తగా కూడా ఉంది కదూ. కొంచెం ఓపిక పట్టి, కాసేపు వికారాన్ని ఆపుకొని ఈ వింత మనిషి కథ వినండి. ఇతగాడి పేరు డేవ్ ముర్ఫీ. వయసు 51. కాని చూడ్డానికి ఐదు పదులు దాటిన వాడిలా లేడు కదా, ఇంకా మోప్ఫైలోనే ఆగిపోయినట్టు ఉన్నాడు. ఇతడికి సిక్స్ ప్యాక్ బాడి కూడా ఉంది. మరి ఏమిటి ఇతని ఆరోగ్య రహస్యం, ఏం తింటాడు, ఏం తాగుతాడు అంటే మూత్రం తాగుతాడు. యాక్ … అదే అలవాటు అనుకుంటున్నారా. తను మూత్ర విసర్జన అందరిలాగా వాష్ రూమ్ లో చేయడు. గ్లాస్ లో చేస్తాడు. దాన్నే తాగుతాడు. ఎప్పుడో 2011 ఎదో థెరపికి హాజరు అయినప్పటినుంచి ఈ అలవాటు మొదలైంది. గత ఆరేళ్లుగా అదే పని చేస్తున్నాడు.

ఇతనికి చికెన్, మటన్, పోర్క్ మాసం కొనాల్సిన పని లేదు. అసలు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించడు అంటా. మంచినీళ్ళు, ద్రాక్ష పళ్ళు, కొన్ని చిప్స్ తానూ విసర్జించే మూత్రం. ఇదే అతని డైట్. ఒకప్పుడు స్టోర్ చేసిన మూత్రాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సేవించేవాడట. ఇప్పుడేమో అలా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు తాగేస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడు ? అతని శరీరానికి ఏమి జరగట్లేదా అని మీకు అనుమానం రావొచ్చు.

ఒకప్పుడు డేవ్ చాలా లావుగా ఉండేవాడట. ఎదో యూరిన్ థెరపికి హాజరయినప్పుడు మూత్రం తాగాలనే ఆలోచన పుట్టిందట. అప్పటినుంచి మొదలు, తిండికి పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. ఇలా మూత్రం తాగడం వలన తన బరువు తగ్గిపోయిందని, స్లిమ్ గా తయారవడమే కాదు, బాడి కూడా పెంచానని, ఒకప్పటి కంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని, తన అలవాటు వలనే తన వయసు కన్నా తక్కువగా కనిపిస్తున్నానని చెబుతున్నాడు డేవ్. దీని వలన తన ఒళ్ళు మారడం ఒకటే కాదు, తానూ ఎంతో డబ్బు దాచుకోగలిగానని, తిండికి అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు, మంచి నీళ్ళు ఉంటే చాలు అంటున్నాడు డేవ్.

మరి నిజంగానే ఇతడి అలవాటు మంచిదా ? ఆరోగ్యకరమైనదా? కాదు, కానే కాదు. ఎందుకంటే మనిషి మూత్రంలో టాక్సిన్స్ ఉంటాయి. మూత్రం అంటే ఏమిటి ? ఒంట్లోని చెత్త బయటకి తీసుకెళ్ళే ద్రవం. మరి అది ఎలా ఆరోగ్యకరమైనది ? ఫ్యాట్స్ తీసుకోవడం మానేస్తే ఎవరైనా బరువు తగ్గుతారు. మరి సిక్స్ ప్యాక్స్ ఎలా వచ్చాయి ? ఎవరికీ తెలుసు ఈ డేవ్ పూర్తిగా నిజమే చెబుతున్నాడు అని.

Continue Reading
More Posts
To Top