డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారు-Media Is Writing Nonsense On Actress For Money 3 months

Disha Patani Making Money Out Of It Md Dhoni Actress Media Writing Nonsense Tiger Shroff డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారు Photo,Image,Pics-

ధోని గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని తెలుసుగా. ధోని అంటే ఇక్కడ నిజమైన ధోని కాదులేండి. ఎమ్.ఎస్.ధోని చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన, ధోని మొదటి ప్రేయసి పాత్రలో నటించింది దిశా. అసలు తన కెరీర్ ని మన తెలుగులోనే మొదలుపెట్టింది ఈ అమ్మడు. పూరి జగన్నాథ్ – వరుణ్ తేజ్ లోఫర్ దిశాకి మొదటి సినిమా.

ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు. దాంతో బాలివుడ్ కి వెళ్ళిపోయి ఎమ్.ఎస్.ధోని రూపంలో ఓ సక్సెస్ రుచి చూసింది. అయితే, ఈ అమ్మడు కెరీర్ మీద తక్కువ, వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది బాలివుడ్ మీడియా.

యువ నటుడు టైగర్ ష్రాఫ్, దిశా మధ్య ఏదో నడుస్తోంది అనేది చాలా పాతమాట. ఇప్పుడు వారిద్దరు విడిపోయారని ఓరోజు, ఇంకా కలిసే ఉన్నారని మరోరోజు రాస్తోంది హిందీ మీడియా. మొత్తం మీద తనకు ఇష్టంలేని కారణాలతో వార్తల్లో ఉంటోంది దిశా.

ఈ విషయంపై స్పందిస్తూ, డబ్బులు సంపాదించుకోవడానికి తనపై ఏదేదో రాసేస్తున్నారు మీడియావారు, అలా తన పరువు తీస్తున్నారని, అయినా తాను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు చేసుకోని మంచిపేరు సంపాదించుకోవడానికే తప్ప, ఇవన్ని పట్టించుకోవడానికి కాదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మ్యూజిక్ డైరెక్టర్ పై పవన్ మళ్ళీ సీరియస్

About This Post..డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారు

This Post provides detail information about డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Making money out of it, Media writing Nonsense, Disha Patani, Tiger Shroff, Affair, Md Dhoni Actress, డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారు

Tagged with:Making money out of it, Media writing Nonsense, Disha Patani, Tiger Shroff, Affair, Md Dhoni Actress, డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారుaffair,Disha Patani,Making money out of it,Md Dhoni Actress,Media writing Nonsense,Tiger Shroff,డబ్బుల కోసం హీరోయిన్ పరువు తీస్తున్నారు,,