అగ్రహీరోలు ... ఓసారి ఈ విషయాన్ని గమనించండి

తెలుగు సినిమా ఇప్పటికీ, సింగల్ స్క్రీన్ మార్కేటే.అంటే క్లాస్ ప్రేక్షకుల కంటే మాస్ ప్రేక్షకులే ఎక్కువ.

 Mass Films Are Potential Record Openers-TeluguStop.com

చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీసుని ఓ ఊపు ఉపారంటే, అది మాస్ ప్రేక్షకుల అండదండలతోనే.ఎన్టీఆర్ అంత తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడంటే సింహాద్రి, ఆది లాంటి మాస్ సినిమాలతోనే.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని మరో ఎత్తుకు తీసుకెళ్ళి, పవన్ ని గడ్డుకాలం నుంచి బయటపడేసింది గబ్బర్ సింగ్ లాంటి మాస్ సినిమానే.ఇక మహేష్ ని స్టార్ ని చేసిన ఒక్కడు, సూపర్ స్టార్ ని చేసిన పోకిరి, రెండూ మాస్ సినిమాలే.

పచ్చిగా చెప్పాలంటే, మన అగ్రహీరోల్ని మాస్ సినిమాల్లో చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు.అలాగని తలాతోకలేని ఆగడు, సర్దార్ గబ్బర్ సింగ్, రభస లాంటి సినిమాలని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు కూడా.

కాని ఆగడు, సర్దార్ గబ్బర్ సింగ్ రెండు రికార్డు ఓపెనింగ్స్ ని రాబట్టాయి.ఇప్పుడు తాజాగా, యావరేజ్ టాక్ తెచ్చుకున్న జనతా గ్యారేజ్ కూడా రికార్డు ఓపెనింగ్స్ రాబట్టుకుంది.

కారణం, మాస్ సినిమాలు కావడం.

ఇదే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ చేసిన క్లాస్ ప్రయోగాలు, తీన్ మార్, 1- నేనొక్కడనే, బ్రహ్మోత్సవం, నాన్నకు ప్రేమతో .ఈ సినిమాలేవి రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోలేదు.అంటే, అగ్రహీరో ఉంటే సరిపోదు .మాస్ సినిమా అయితేనే ప్రేక్షకులు గట్టి ఓపినింగ్స్ ఇస్తారు.అలాగని ప్రయోగాలు చేయకూడదని కాదు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాన్నకు ప్రేమతో చిత్రాలకు ఓపెనింగ్స్ పెద్దగా రాకపోయినా, లాంగ్ రన్ లో ప్రేక్షకాదరణ పొందాయి.

కారణం, మంచి కథ ఉండటమే.

చివరగా, మన తెలుగు హీరోలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మాస్ సినిమాలు సరిగా రాకపోయినా, కనీసం ఓపెనింగ్స్ ఆయినా వస్తాయి.అదే క్లాస్ సినిమా బాగుంటే తప్ప, జనాలు హీరో స్థాయిని కూడా సరిగా పట్టించుకోరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube