వై ఎస్ జగన్ సూపర్ స్టార్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… పొలిటికల్ సూపర్ స్టార్ అట.అయినా సినిమాల్లో కదా సూపర్ స్టార్లు ఉండేది, రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారనేగా మీ అనుమానం? దుర్ముఖి నామ సంవత్సరాదిని పురస్కరించుకుని నిన్ననే ఏపీ రాజకీయాల్లోకి కూడా సూపర్ స్టార్లు వచ్చేశారు.నిన్న హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఉగాది ఆస్థానంలో భాగంగా పంచాగ శ్రవణం వినిపించిన ప్రముఖ పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి…ఈ కొత్త పదాన్ని తొలిసారిగా వాడారు.

 Marepalli Ramachandra Sastry Panchangam About Ys Jagan-TeluguStop.com

తన పంచాంగ శ్రవణంలో భాగంగా సాంతం వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల చుట్టే తిరిగిన మారేపల్లి… జగన్ ను పొలిటికల్ సూపర్ స్టార్ గా అభివర్ణించారు.

కుట్రలు, కుతంత్రాలతో పెట్టిన అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలానే కాక 24 కేరట్ల బంగారంలా జగన్ బయటపడతారని శాస్త్రి సెలవిచ్చారు.అంతేకాకుండా దుర్ముఖి నామ సంవత్సరంలో వైసీపీ భవిష్యత్తు బ్రహ్మాండంగానూ ఉందని మారేపల్లి వెల్లడించారు.

రాష్ట్రంలో చల్లని గాలి వీయాలంటే ఫ్యాన్ అధికారంలోకి రావాల్సిందేనని కూడా ఆయన సెలవిచ్చారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube