'మహా'లో ముదిరిన భాషా పైత్యం

ప్ర తివారికీ మాతృ భాషాభిమానం ఉండాలి.కాని అది పిచ్చి, పైత్యంలా మారకూడదు.

 Only Marathi Movies In Mumbai Multiplexes-TeluguStop.com

తమిళనాడు, కర్నాటక, మహారాష్ర్టల్లో మాతృభాషాభిమానం మరీ ఎక్కువ.ఈ రాష్ర్టాల్లో అభిమానం ముదురుపాకాన పడింది.

విపరీతమైన భాషాభిమానం తీవ్రవాదం కంటే ప్రమాదరకమైంది కూడా.భాషా పైత్యాన్ని వ్యతిరేకించినవారిని ద్రోహులుగా కూడా చిత్రీకరిస్తారు.

ప్రస్తుతం మహారాష్ర్టలో ఇదే జరుగుతోంది.ఈ రాష్ర్టంలోని దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.అదేమిటంటే…రాష్ర్టంలోని మల్టీఫ్లెక్సుల్లో కేవలం మరాఠీ సినిమాలే (ప్ర ధానంగా) ప్రదర్శించేలా చట్టం చేయాలని నిర్ణయించింది.ఇలాంటి నిర్ణయం ఏ రాష్ర్టంలోనూ చేసివుండరు.

దీనికి శివసేన మద్దతు పలికింది.ఈ నిర్ణయాన్ని ప్రముఖ రచయిత్రి శోభా డే (ఆంగ్లంలో రచనలు చేస్తుంటారు) తీవ్రంగా వ్యతిరేకించడంతో శివసేన ఆమెపై విరుచుకుపడింది.

తన పత్రిక సామ్నాలో తీవ్రంగా విమర్శించింది.ఇంతకూ శోభాడే ఏమంది? ‘నేను మరాఠీ సినిమాలంటే ఇష్టపడతాను.కాని థియేటర్లలో మరాఠీ సినిమాలే ప్రదర్శించాలనే చట్టం చేయాలనుకోవడం దాదాగిరి చేయడంవంటిదే’ అని వ్యాఖ్యానించింది.దీంతో శివసేన మండిపడి ‘మీ తాతలు పాకిస్తాన్‌లో పుట్టారు.మీ పిల్లలు పాకిస్తాన్‌లో పుట్టారు.నువ్వు పేజీ ౩ పార్టీలకు వెళితే బురఖాలు వేసుకొని వెళతావు’ అని చిందులేసింది.

నువ్వు మరాఠీ మహిళవై ఉండి ప్ర భుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తావా? అంటూ ప్రశ్నించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వారు పాకిస్తాన్‌ వారేనా? శివసేన ప్రజలను ఇలాగే రెచ్చగొడుతుంది మరి…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube