మంచు ఫ్యామిలీలో క్రేజీ సినిమాలు తీస్తూ రాకింగ్ స్టార్ గా అభిమానులను హుశారెత్తించే మంచు మనోజ్ ఈ మధ్య కాస్త రేసులో వెనుక పడ్డాడని చెప్పాలి.మనోజ్ లాస్ట్ రిలీజ్ శౌర్య ఘోరంగా పోయింది.
సినిమా ఫ్లాప్ అవ్వడం పక్కన పెడితే శౌర్యలో మనోజ్ లుక్ పై తీవ్రంగా విమర్శలొచ్చాయి.అందుకే తన లుక్ ను మార్చుకునే పనిలో పడ్డాడు మంచు కుర్రాడు.
పెళ్లి తర్వాత లావెక్కిన మనోజ్ ఇప్పుడు తనను స్లిమ్ గా మార్చుకోబోతున్నాడు.
అందుకే జిమ్ లో గంటలు గంటలు ఉంటున్నాడట.
లావుగా ఉన్న హీరోలు అటో పక్క సినిమాలు చేస్తూ మరో పక్క బాడీ తగ్గించే ప్రయత్నాలు చేస్తారు.కాని మనోజ్ మాత్రం తను లావు తగ్గిన తర్వాతనే సినిమా స్టార్ట్ చేసేది అంటున్నాడట.
మరి ఏదో ఒకరోజు యమదొంగలో ఎన్టీఆర్ లా సన్నగా స్లిమ్ లుక్ తో అందరికి షాక్ ఇస్తాడట మంచు మనోజ్.సో లుక్ కోసం కష్టపడుతున్న మనోజ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.
.