నటీ నటులకు ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ రోల్స్ ఉంటూ ఉంటాయి.పలాన దర్శకుడి దర్శకత్వంలో నటించాలని, పలాన హీరో లేదా హీరోయిన్‌తో సినిమా చేయాలని అంతా అనుకుంటారు.
అందరిలాగే మంచు లక్ష్మికి కూడా డ్రీమ్ రోల్ ఉంది.అలాగే డ్రీమ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు.
తాజాగా ఈమె తన డ్రీమ్‌ను మీడియాకు తెలియజేసింది.ఈమెకు రాజమౌళి దర్శకత్వంలో రaాన్సీ లక్ష్మిభాయ్‌గా నటించాలనే కోరిక ఉందంటూ ప్రకటించింది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.అలాగే మంచు లక్ష్మికి కూడా ఉంది.
అయితే రaాన్సీ లక్ష్మిభాయ్‌గా నటించాలనే ఈమె కోరిక తీరడం మరింత కష్టం.రాజమౌళి హిస్టారికల్ సినిమాలు చేయడం ఇక మానేస్తున్నట్లుగా ఆ మధ్య ప్రకటించాడు.
దాంతో మంచు లక్ష్మి కోరిక తీరడం దాదాపు అసాద్యం అని చెప్పక తప్పదు.ఇక ఈమె ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే తాజాగా ‘బుడుగు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మే 1న ‘దొంగాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.‘బడుగు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మంచు లక్ష్మి ‘దొంగాట’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటుంది.