రేప్ ని అడ్డుకుందని, గొంతులో విషం పోసాడు

ప్రపంచం ఎటువైపు సాగుతోంది అనే తాత్విక చింతన రాకమానదు రోజురోజుకి దిగజారుతున్న మనుషుల ప్రవర్తన చూస్తే.మనదేశంలో ప్రతీరోజు వందలాది, వేలాది మహిళలు మానభంగానికి గురవుతున్నారు.

 Man Killed A Girl With Poison As She Fighted Against His Rape Attempt-TeluguStop.com

అందులో చాలామంది హత్య చేయబడుతున్నారు కూడా.కొన్ని మీడియా దృష్టికి వస్తాయి, కొన్ని రావు.

మీడియా దృష్టికి పెద్దగా కనిపించని ఒక దారుణమైన సంఘటన నిన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

అతని పేరు సాజిద్ ఖాన్.

ఉత్తరప్రదేశ్‌లోని తెడ్వా గ్రామం నివాసి.అక్కడే ఒక 18 ఏళ్ళ అందమైన యువతిపై చాలారోజులుగా కన్నేశాడు.

మొత్తానికి అవకాశం చూసుకోని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు.ఆ టీనేజర్ అతనికి అస్సలు లొంగలేదు.

మీద పడుతున్నా, అడ్డుకుంది.తప్పించుకోవడానికి తన బలాన్నంతా కూడదీసుకోని ప్రయత్నించింది.

సాజిద్ కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతిఘటించింది.ఇక తనవల్ల కాదని అర్థం చేసుకున్న సాజిద్, ఊర్లో వారందరికి తన దుర్భుద్ధి గురించి చెబుతుందనే భయంతో, తన వెంటే తీసుకొచ్చిన విషాన్ని తాగించాడు ఆ అమ్మాయితో.

యువతీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.విషయం గ్రామస్థులకు తెలియడంతో వెంటనే ఊరు వదిలి పారిపోయాడు సాజిద్.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం అతనికోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube