బాహుబలిని అనుకరిస్తూ నీటికొండ నుంచి దూకాడు ... ఆ తరువాత ఏమైందంటే

అపుడెప్పుడో 90లలో శక్తిమాన్ అంటూ ఒక టీవి సీరియల్ వచ్చేది గుర్తుందా ? ఈతరం వారు ఆ సీరియల్ ని ఎలా మరచిపోతారు లెండి.మన దేశంలో తోలి సూపర్ హీరో అతనేగా.

 Man Dies After Failing To Jump Like Baahubali From Waterfall Inb-TeluguStop.com

అదేదో వెరైటి సౌండ్ తో బిల్డింగ్ మీది గుండ్రగా తిరుగుతూ ఆకాశంలోకి వెళ్ళిపోతుంటాడు శక్తిమాన్.ఆ దివ్యశక్తులు మనకూ ఉన్నాయేమో, అలా గాల్లో తిరిగితే మనము ఎగురుతామేమో అనుకోని కొందరు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇలాంటి విచిత్ర సంఘటనలు అమెరికాలో కూడా జరిగాయి.కాని సూపర్ హీరో వలన కాదు.

ఓ సీరియల్ కిల్లర్ వలన.డెక్స్ టర్ అని ఒక టీవి సీరీస్ వచ్చేది.అందులో హీరో ఒక సీరియల్ కిల్లర్.తాను స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫోరెన్సిక్ సైంటిస్ట్ గా పనిచేస్తూ, చట్టం నుంచి తప్పించుకునే క్రిమినల్స్ కి చాలా ఘోరంగా, ప్లాన్డ్ గా, ఎవరికీ తెలియకుండా, ఎవరికి దొరక్కుండా చంపుతుంటాడు.

అచ్చం ఆ హీరో చంపినట్లే, అమెరికాలో మర్డర్లు జరిగాయి.ఇలా ఉంటారండి జనాలు.సినిమాలు/ సీరియల్లు చూసి, తిక్క తిక్క వేషాలు వేస్తారు.

-Top Posts Featured Slide
కొత్తగా బాహుబలిని అనుకరించబోయి ఒక బిజినెస్ మెన్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.ముంబై నగర పరిసారాల్లో మహులి అనే ప్రాంతంలో ఒక పెద్ద జలపాతం ఉందండి.అక్కడికి బాహుబలికి ముందు నుంచి కూడా సందర్శకులు వచ్చేవారు.

కాని తిక్క వేషాలు వేసేవారు కాదు.కాని ఎప్పటి నుంచితే బాహుబలి విడుదలయ్యిందో, అప్పటినుంచి ఆ జలపాతానికి క్రేజు పెరిగిపోయింది.

దానితో పాటే పోలీసులకి తలనొప్పులు పెరిగిపోయాయి.ఎందుకంటే వచ్చినవారు కామ్ గా వాటర్ ఫాల్ చూసి వెళ్ళకుండా, ధీవర అంటూ పాటలు పాడుకుంటూ పిచ్చి పిచ్చి స్టంట్స్ వేస్తున్నారట.

ఈ పిచ్చి ఒకరి ప్రాణాలు తీసేంతగా ముదిరింది.

ఇంద్రపాల్ పాటిల్ అనే 27 ఏళ్ల బిజినెస్ మెన్ మహులి వాటర్ ఫాల్స్ దగ్గరికి తన ఫ్రెండ్స్ తో వెళ్ళాడట.

అక్కడికి వెళ్లి బాహుబలి సినిమా గురించి, ధీవరలో ప్రభాస్ చేసిన ధైర్యసాహసాల గురించి మాట్లాడుకుంటూ, పైకి ఎక్కి నిజంగానే జంప్ చేసేసాడు.అది ఆత్మహత్య అనుకునేరు .సంపాదన, ప్రేమించే భార్య, సంతోషకరమైన జీవితమే తనది.కాని థ్రిల్ కోసం వెర్రెక్కి చేసిన ఓ పని ప్రాణాలు తీసింది.

అక్కడికక్కడే చనిపోయాడు ఇంద్రపాల్.ఇప్పుడు అధికారులకి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదట.

ఈ జలపాతానికి సందర్శకులు రాకుండా చేద్దామా, లేక ఇచట బాహుబలి స్టంట్స్ చేయరాదు, చేస్తే కఠిన చర్యలు ఉంటాయని బోర్డు పెడదామా అని ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube