అనుమానంతో 13 ఏళ్ల భార్య చెవులు కోసేసాడు

ఆఫ్ఘానిస్తాన్ .ఆరు సంవత్సరాల వయసు దాటితే చాలు, ఆడపిల్లలకి పెళ్ళి చేసే ప్రయత్నాలు మొదలుపెడతారట అక్కడి తల్లిదండ్రులు.

 Man Cuts Off His Wife’s Ears With Allegation Of Talking To Other Men-TeluguStop.com

అబ్బాయి/పెళ్ళికొడుకు చాలావరకు అమ్మాయికి తండ్రి, దురదృష్టం మరీ ఎక్కువైతే తాత వయసులో ఉంటాడట.అంత చిన్న వయసు ఉన్న అమ్మాయిలను కూడా తమ కామవాంఛల కోసం హింసించడం, కూలితో చేయించుకున్నట్టు పని చేయించుకోవడం, కొట్టడం, తిట్టడం, ఇవి రోజు కనిపించే దృశ్యాలే అంట.

ఇప్పుడు అదే నేలపై, మరో అమ్మాయి మీద ఓ అఘాత్యం జరిగింది.13 ఏళ్ల జరీనా చెవులు కోసేసాడు భర్త.ఈ విషయం వినడానికే ధైర్యం చాలట్లేదు .ఆ మాహనుభావుడికి చేతులెలా వచ్చాయో.తన ప్రవర్తన నచ్చక విడాకులు తీసుకునే ఆలోచనలో ఉందట ఈ అమ్మాయి.ప్రతి చిన్న విషయానికి అనుమానించే తన భర్తకి దూరంగా ఉండటానికి వీలుపడిన ప్రతిసారి పుట్టింటికి వెళ్ళేదట.

పుట్టింటి దగ్గర ఎవరితోనో జరీనా రోజు మాట్లాడుతున్నట్లు భర్తకి అనుమానం.

తనదగ్గరికి తిరిగి వచ్చాకా, ఓరోజు రాత్రి నిద్రిస్తున్న జరీనాను లేపి, మంచానికి కట్టేసి, మరో మగవాడితో ఎలా మాట్లాడావు, వాడి మాటలు ఎలా విన్నావు అంటూ చెవులు కోసేసి, పరారయ్యాడు.

ప్రస్తుతం జరీనా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.ఇలాంటి సంఘటనలు అక్కడ కొత్తేమి కాదు.ఆమధ్య ఇలాంటి మూర్ఖుడే తన భార్య ముక్కు కోసేసిన సంఘటన ఒకటి బయటపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube