సుబ్రమణ్యం సక్సెస్‌ వెనుక..!  

Reason Behind Subramanyam For Sale Success-

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, నిర్మాత దిల్‌రాజుకు భారీ లాభాలను తెచ్చి పెడుతోంది.మొదటి మూడు రోజులు కూడా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు సైతం లాభాల బాట పట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇంత భారీ సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరోసారి స్టార్‌ దర్శకుడు అయ్యాడు.

Reason Behind Subramanyam For Sale Success- --

‘గబ్బర్‌ సింగ్‌’తో స్టార్‌ డైరెక్టర్‌ అయ్యి, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం డిజాస్టర్‌ అవ్వడంతో పాతాలానికి హరీష్‌ క్రేజ్‌ పడి పోయింది.

తాజాగా ఈ సినిమాతో మళ్లీ తన క్రేజ్‌ను తెచ్చుకున్నాడు.‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీలోని పలు డైలాగ్స్‌ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి.

హరీష్‌ గుండెలను తాకేలా డైలాగ్స్‌ రాసి అందరిని ఆకట్టుకున్నాడు.తాజాగా డైలాగ్స్‌ గురించి మాట్లాడుతూ.ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు మనిషిలోని మొత్తం బయటకు వస్తుంది.అదే విధంగా నాలో ఉన్న టాలెంట్‌ మొత్తం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ రూపంలో బయటకు వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

తన పూర్తి స్థాయిని, ప్రతిభను పెట్టి ఈ సినిమాను తెరకెక్కించడం వల్లే ఈ సినిమా తనకు సక్సెస్‌ను తెచ్చి పెట్టింది అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.త్వరలోనే ఈయన తన తర్వాత సినిమాను ప్రకటిస్తాను అంటూ పేర్కొన్నాడు.

.

తాజా వార్తలు

Related....