గర్భవతి కావాలనుకుంటున్న హాట్ హీరోయిన్

ఒకనాటి సెక్సీ భామ మల్లిక శెరావత్ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటోంది.తను మొదలుపెట్టిన ముద్దు సన్నివేశాల ట్రెండ్ ఇప్పుడు ప్రతి ఒక్క బాలివుడ్ హీరోయిన్ పాటిస్తుండటంతో మల్లికని పక్కనపెట్టిసింది బాలివుడ్ ప్రపంచం.

 Mallika Sherawat Wants To Become Pregnant-TeluguStop.com

అదీకాక, సన్నిలియోన్ రాక మల్లిక అవకాశాల్ని మూసేసింది.ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించిన ఈ భామ, ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది.

మల్లిక బాయ్ ఫ్రెండ్ పేరు సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్.ఇతడొక ఫ్రెంచ్ బిజినెస్ మన్.ఇద్దరు కలిసి రెండు సంవత్సరాలుగా పారిస్ లో ఉంటున్నారు.మల్లిక చేతిలో ఏదో హాలివుడ్ సినిమా ఆఫర్ ఉందట.

ఆ తరువాత పెద్దగా కెరీర్ మీద నమ్మకాలు లేని మల్లిక, వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలనుకుంటోందట.

త్వరలోనే గర్భం దాల్చి, తన బాయ్ ఫ్రెండ్ కి ఓ బిడ్డని ఇవ్వాలని మల్లిక ఉబలాటపడుతోందని బాలివుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

మొత్తానికి యువతని ఉర్రూతలూగించిన మల్లిక కెరీర్ ఇలా ఎండ్ అవుతోందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube