రాజమౌళి ఏం చేసినా కూడా భారీగానే చేస్తాడు.ఈయన కెరీర్ మొదటి నుండి ఏ సినిమాను చూసినా కూడా భారీ తనంతో ఉంటుంది.
తాజాగా రాజమౌళి ‘బాహుబలి’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.దాదాపుగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఒక తెలుగు సినిమాకు ఇంత భారీ బడ్జెట్ అవసరమా అనేది పలువురి ప్రశ్న.అయితే తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన మేకింగ్ వీడియో ఈ అభిప్రాయాన్ని తుడిచి వేస్తోంది.
నిర్మాతలు పెడుతోన్న ఈ భారీ బడ్జెట్ తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో క్లీయర్‌గా కనిపిస్తోంది.
భారీ సెట్టింగ్స్‌తో పాటు, ప్రతీ ఒక్క విభాగం కూడా ఎంతో శ్రద్దతో, భారీ సంఖ్యలో టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు.
నటీనటులు మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్, టెక్నికల్ టీం అంతా కలిసి ఈ సినిమాను ప్రేక్షకులు ఊహిస్తున్న స్థాయి కంటే మరింత ఉన్నతంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నారు.మేకింగ్ వీడియో చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కోరిక ప్రేక్షకుల్లో కలుగక మానదు.
మేకింగ్ వీడియోతోనే తన సినిమా స్థాయిని చూపించి, అంచనాలను రెట్టింపు చేసిన రాజమౌళికి అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు.ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విషయం తెల్సిందే.