లోగోను కాపీ కొట్టలేదు

మేక్‌ ఇన్‌ ఇండియా లోగో ఎలా ఉంటుందో మనకు తెలుసు.మోదీ ప్రభుత్వం తయారుచేసిన ఈ సింహం బొమ్మలో వివిధ రకాల పారిశ్రామిక చక్రాలు, అందుకు సంబంధించిన సామగ్రి కనబడుతుంటాయి.

 Make In India Lion Logo Not Inspired By Swiss Bank Ad-TeluguStop.com

అయితే ఈ లోగో మోదీ సర్కారు సొంత ఆలోచన కాదని, స్విస్‌ బ్యాంకు ప్రకటన నుంచి స్ఫూర్తి పొంది (మామూలు భాషలో చెప్పలంటే కాపీ కొట్టడమే) తయారు చేశారని ఓ నివేదికలో వచ్చింది.దీన్ని ప్రభుత్వం తోసి పుచ్చింది.

మేక్‌ ఇన్‌ ఇండియా లోగోను స్విస్‌ బ్యాంకు ప్రకటన చూసి తయారు చేయలేదని వివరించింది.మేక్‌ ఇన్‌ ఇండియా లోగో వైబ్రాంట్‌గా, డైనమిక్‌గా ఉందని, స్విస్‌ బ్యాంకు ప్రకటనలోని బొమ్మ డల్‌గా బోరింగ్‌గా ఉందని పేర్కొంది.

కాంటోనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జ్యూరిచ్‌ లోగో మన మేక్‌ ఇన్‌ ఇండియా లోగో మాదిరిగానే ఉంటుంది.కాపీ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది.

సినిమాలు, పుస్తకాలు, పాటలు…ఇలా ఎన్నో కాపీ కొడుతున్నారు.కొందరు పోతేపోనీలే అని ఊరుకుంటే కొందరు కోర్టుల్లో కేసులు వేస్తారు.

మరి ఇప్పుడు భారత ప్రభుత్వం లోగో కాపీ కొట్టిందంటూ స్విస్‌ బ్యాంకు కోర్టులో కేసు వేస్తుందా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube