డబ్బులు తిరిగి ఇచ్చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చి సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్టు ఉంటుందని పలుమార్లు మహేష్ కూడా చెప్పాడు.

 Mahesh Returns His Payment-TeluguStop.com

హారిక హాసిని క్రియేషన్స్ పై రాధకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు.ఈ విషయాన్ని ప్రకటిస్తూ మహేష్ పుట్టినరోజున పేపర్ ఆడ్ కూడా ఇచ్చారు రాధకృష్ణ .

ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్.ఈ చిత్ర షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి వరకు పూర్తవుతుంది.

ఆ తరువాత ఎప్రిల్ నుంచి మురగదాస్ చిత్రంతో బిజిగా ఉంటాడు సూపర్ స్టార్.నిజానికి మొదట ప్లాన్ ప్రకారం బ్రహ్మోత్సవం తరువాత త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టలి.

కాని ఎప్పటినుంచో అనుకుంటున్న మురగదాస్ సినిమా అనుకోకుండా లైన్ లోకి వచ్చింది.మురగదాస్ మాట కూడా కాదనలేకపోయాడు మహేష్.

దాంతో త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టాల్సివచ్చింది.

మహేష్ హ్యండ్ ఇవ్వడంతో చరణ్ తో సినిమా కమిట్ అయిపోయాడు త్రివిక్రమ్.

నిర్మాత రాధకృష్ణ ఇచ్చిన డబ్బులు కుడా తిరిగి ఇచ్చేసాడు.మరి మళ్లీ ఇదే కాంబినెషన్ లో సినిమా ఉంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube