మహేష్ - ఎన్టీఆర్ కి పోటి లేనట్టేనా?

పండగా సీజన్ అంటే రెండు పెద్ద సినిమాలు ఉండటం సాధారణం.కాని పవన్, మహేష్, ఎన్టీఆర్ ఈ ముగ్గురిలో ఇద్దరు పోటిపడటమే సాధారణం కాదు.

 Mahesh-ntr Clash To Be Cancelled?-TeluguStop.com

అలాంటి స్టార్ పవర్ ఉన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటిపడితే ఆ వాడివేడి వేరే ఉంటుంది.ఈ దసరాకి మహేష్ బాబు – ఎన్టీఆర్ పోటి అనగానే ట్రేడ్ వర్గాల్లో ఎక్కడలేని ఆసక్తి మొదలైంది.

మహేష్ బాబు తన స్పైడర్ ని సెప్టెంబర్ 27న తీసుకోస్తుండగా, ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ అదే నెల 21న విడుదల కానుందని అనౌన్స్ మెంట్ వచ్చింది.వారం గ్యాపులో సమానమైన అవకాశాలు ఉన్న రెండు పెద్ద సినిమాలు ఈమధ్య ఎప్పుడు పోటిపడలేదు.

అందుకే ఎక్కడలేని ఆసక్తి.కాని ఆ పండగ పోటి వాతావరణం కాస్త తుస్సుమనేలా ఉంది.

స్పైడర్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, కేవలం ఒక్కటంటే ఒక్క పాట షూట్ చేయడం బ్యాలెన్స్ గా ఉంది.మహేష్ ఇప్పటికే ఇటు తెలుగులో, అటు తమిళంలో డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడు.

ఇక గ్రాఫిక్స్ పనులు అంటారా, మరో నెలన్నర సమయం ఉంది.కాబట్టి స్పైడర్ ఇక్కడి నుంచి వాయిదా పడటం దాదాపుగా అసాధ్యం.

దసరాకి స్పైడర్ బరిలో దిగడం ఖచ్చితం.కాని ఎన్టీఆర్ మీదే ఎదో మూల సందేహం.

ఎందుకంటే జై లవ కుశకి సంబంధించి ఇంకా చాలా పార్ట్ షూట్ చేయాల్సి ఉంది.

ఒకవేళ సెప్టెంబర్ రెండోవవారం కల్లా షూటింగ్ పనులు పూర్తి అయితేనే సెప్టెంబర్ 21న వస్తారట.

షెడ్యూల్స్ మారి తేడా కొడితే జై లవ కుశ అనుకున్న సమయానికి రావడం కష్టమే.స్పైడర్ తో పోలిస్తే దీనికి పెద్దగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండవు కాని, షూటింగ్ పూర్తవడమే సమస్య.

ఒకవేళ ఎన్టీఆర్ మిస్ అయిపోతే దసరా వన్ వే అయిపోతుంది.

ఎందుకంటే దసరాకే రావాల్సిన పైసా వసూల్ సెప్టెంబర్ మొదటివారానికి షిఫ్ట్ అయ్యింది.

ఒకవేల ఎన్టీఆర్ రాకపోతే మహేష్ ధాటిలో రామ్ మరియు ఆది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, ఆది నటించిన నెక్స్ట్ నువ్వే కూడా దసరాకే వస్తున్నాయి.

ఎలాగో ఈ రెండు సినిమాలు హిట్ అయినా, ఫట్ అయినా స్పైడర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.కాబట్టి ఎన్టీఆర్ వస్తేనే దసరా బాక్సాఫీస్ రసవత్తరంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube