ఓ క్రేజీ కాంబినేషన్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఇక గాసిప్పు రాయుళ్లకు చేతినిండా పని అన్నట్టే.పూటకో వార్త సంచలనంగా సృష్టించి హడావిడి చేసేస్తారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక స్టార్ కాంబో గురించి రచ్చ జరుగుతూనే ఉంటుంది.ప్రస్తుతం అందరి ఫోకస్ మహేష్, మురుగదాస్ సినిమా మీద ఉంది.
బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో మహేష్ ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.మురుగదాస్ కూడా సినిమా ప్రీ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకుని రెడీ ఫర్ షూట్ అనేస్తున్నాడు.
జూలై రెండో వారంలో స్టార్ట్ అవనున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తుంది.మొన్నటిదాకా సినిమా టైటిల్ చట్టంతో పోరాటం, జస్టీస్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా మహేష్ సినిమాకు ‘వాస్కోడగామ’ అనే టైటిల్ పరిశీలణలో ఉన్నారట చిత్రయూనిట్.పారాస్ జైన్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ భరీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓకే అయ్యింది.
మరి బయటకు వచ్చిన ‘వాస్కోడగామ’ టైటిల్ అయినా నిజమా కాదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.
.