ఈ కారణం వలనే మహేష్ బాబు నెం.1 అయ్యాడు

మహేష్ బాబు సినిమాలు ఆలస్యంగా చేస్తాడేమో కాని, సెట్లో తన డెడికేషన్ లెవల్స్ మామూలుగా ఉండవు అని చెబుతుంటారు మహేష్ తో పనిచేసిన దర్శకులంతా.టక్కరిదొంగ సినిమానే చూడండి .ప్రాణాలు పణంగా పెట్టి కొండలపై షాట్స్, ట్రెయిన్ ఫైట్ షాట్స్ చేసాడు.1-నేనొక్కడినే సినిమాలో ఒక బిల్డింగ్ మీది నుంచి మరో బిల్డింగ్ మీదకి దూకేసాడు.స్పైడర్ లో ఇంతకంటే ప్రమాదకరమైన స్టంట్స్ చేసాడంట.అక్కడికే ఇంప్రెస్ అయిపోయిన మురుగదాస్ ఇప్పుడు మహేష్ ని పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నాడు.

 Mahesh Is No.1 For This Reason-TeluguStop.com

అపుడెప్పుడో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలు ఒకేసారి రెండు సినిమాలు చేసేవారని, ఒకే రోజులో రెండు మూడు షిఫ్టులు పనిచేవారు అని విన్నాం మనం.ఈకాలంలో అలా పనిచేసే వారు ఎవరు లేరు.స్టార్ హీరోలను పక్కనపెట్టండి, కుర్ర హీరోలు కూడా అలా పనిచేయట్లేదు.కాని మహేష్ బాబు చేస్తున్నాడు.పగలు భరత్ అనే నేను షూట్ చేస్తే, రాత్రుళ్ళు స్పైడర్ సెట్లో గడుపుతున్నాడు.ఏడాదికాలంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నా, ఇంకా పూర్తవట్లేదు స్పైడర్.

ప్యాచ్ వర్క్ దాదాపుగా పూర్తికావచ్చింది.రెండు పాటలు ఇంకా మిలిగి ఉన్నాయి.

ఈ పాటలను ఎలా తీయబోతున్నారో తెలుసా? ఓసారి తెలుగులో, మరోసారి తమిళంలో.అవును, రెండు పాటలను రెండు సార్లు కాదు, నాలుగు సార్లు షూట్ చేయబోతున్నాడు మహేష్.

ఎంత ఓపిక ఉండాలి, ఎంత కష్టపడాలి.

మహేష్ లోని ఈ గుణం వలనే ఇంత పెద్ద స్టార్ గా ఎదిగాడని, అందుకే మహేష్ వెంట దర్శకులు పడుతూ ఉంటారని, అందుకే మహేష్ నెం1 అయ్యాడని మురుగదాస్ సెట్లో మురిసిపోతూ పబ్లిక్ గా కాంప్లిమెంట్స్ ఇచ్చారట.

అంతా బాగానే ఉంది కాని మెగాస్టార్ చిరంజీవి ఉండగా మహేష్ ని నెం1 అనడం కాస్త వింతగా ఉంది.మరి ఈ వార్త చిరంజీవి ఫ్యాన్స్ దాకా వెళితే ఎలా రెస్పాండ్ అవుతారో.

మిగితా విషయాలు మాట్లాడుకుంటే, స్పైడర్ కొత్త టీజర్ ఒకటి అయితే జులై చివరో, లేదంటే మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్తు 9న విడుదల కానుందట.అదే నెల చివర్లో ఇటు తెలుగులో ఓసారి, అటు తమిళంలో మరోసారి ఆడియో ఫంక్షన్ ని నిర్వహిస్తారు.

సెప్టెంబర్ చివరి వారంలో దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube