తమ అభిమాన హీరోతో ఒక్క ఫోటో దిగాలని ఏ అభిమానికి కోరికగా ఉండదు ! అందుకే ఎవరో ఒక సీనియర్ అభిమానినో, హీరోతో పరిచయం ఉన్న వారిని బ్రతిమిలాడుకొని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ కి వచ్చి హీరోతో ఫోటోలు దిగి వెళ్తుంటారు.అభిమానం మరీ ఎక్కువైతే షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికే వెళ్తారు.
సూపర్ స్టార్ మహేష్ అసలు ఏమాత్రం విసుగు లేకుండా తన అభిమానులకు ఫోటోలు ఇస్తుంటాడు.కాని ఏదైనా సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు మాత్రం ఫోటోలు ఇవ్వడం మహేష్ కి నచ్చదు.
అందుకే సాంగ్ షూట్ సమయంలో ఎక్కువగా మహేష్ దగ్గరికి వెళ్ళరు అభిమానులు.
ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ ఊటీలో జరుగుతున్న విషయం తెల్సిందే.
మొన్నటి నుంచి పాటను చిత్రీకరిస్తున్నారు.కొందరు అభిమానులు ఎగేసుకొని ఊటి దాకా వెళ్ళారు.
సరే ఇక చాలా దూరం నుంచి ఊటి దాకా వచ్చారు కదా అని లోనికి అనుమతించారు.అసలే షూటింగ్ సమయం, పైగా పాట చిత్రీకరణ, అస్సలు టైం ఉండదు, వేల్లేమో గుంపులు గుంపులుగా వచ్చారు.
మహేష్ ఫోటోలు ఇవ్వదానికి వచ్చేసరికి వాళ్ళు కెమెరా కుడా ఏర్పాటు చేసుకోలేదట.ఇంకేముంది, మహేష్ కి కోపం వచ్చేసింది.
యూనిట్ ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించి, అభిమానులని కాస్త మందలించి, దూరంగా షూటింగ్ ఉన్నప్పుడు రావొద్దు అని నచ్చజెప్పాడట.