సూపర్ స్టార్ – మురుగదాస్ సినిమా మొదలవడానికి ఇంకా నలుగు నెలల సమయం ఉంది.కాని ఇప్పటినుంచే నిత్యం వార్తల్లో ఉంటోంది ఆ ప్రాజెక్ట్.
దానికి కారణం ఆ సినిమాపై వస్తున్న రూమర్స్.మహేష్ డబుల్ రోల్ అని, చట్టం తో పోరాటం, ఎనిమీ లాంటి విచిత్రమైన టైటిల్స్ తో ఏది పడితే అది రాసిన మీడియాకు ఇప్పటికే మురగాదాస్ సమాధానం చెప్పాడు.
ఇక తాజాగా మరో రూమర్ ఏమిటంటే , ఈ చిత్ర కథ మొదట అజిత్ కి వినిపించారని, అజిత్ కాదనడంతో మహేష్ దగ్గరికి వెళ్ళారని.
కాని దీన్ని కుడా కొట్టిపాదేసాడు మురగదాస్.
రూమర్స్ ఆపండి, మహేష్ సినిమా పూర్తిగా కొత్త స్క్రిప్ట్, తన కోసమే రాసింది అని చెప్పేసాడు మురగదాస్.దానితో ఈ కొత్త రూమర్ కి కుడా కొత్త ఫుల్ స్టాప్ పడింది.
ఇక మళ్ళి రూమర్స్ పుట్టల్సిందే, వెబ్ సైట్స్ కి, న్యూస్ చానెల్స్ కి కాలక్షేపం కావాల్సిందే.
ఎన్వీ ప్రసాద్ , ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తారు.
ప్రస్తుతానికైతే బాలివుడ్ భామ శ్రద్ధ కపూర్ కథానాయిక అంటున్నారు.ఏప్రిల్ రెండోవారంలో ఈ చిత్రం మొదలుకానుంది.
.