మహేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు

సూపర్ స్టార్ మహేష్ కి ఏం తక్కువ, పాపులారిటి ఉంది, రికార్డులు ఉన్నాయి, ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మరి మహేష్ కి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అని అనుకుంటున్నారా.

 Mahesh Expecting Sudheer Career To Take A Turn-TeluguStop.com

మహేష్ ఆశలు పెట్టుకుంది తన సినిమాల మీద కాదు.తన బావ సుధీర్ మీద.

సుధీర్ కెరీర్ లో ఇప్పటివరకు అయిదు సినిమాలు వచ్చాయి.అందులో ఒక్కటే బ్లాక్బస్టర్.

కాని ప్రేమథచిత్రం ఇచ్చిన ఊపుని ఉపయోగించుకోలేకపోయాడు సుధీర్.ఆ తరువాత వచ్చిన ఆడు మగాడ్రా బుజ్జి, మోసగాళ్ళకు మోసగాడు దారుణంగా విఫలమవగా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఫరవాలేదనిపించింది.

సుధీర్ కొత్త చిత్రం భలే మంచి రోజుకి ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.అందుకే దిల్ రాజు, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలు వచ్చి ఈ చిత్రాన్ని నైజాం, గుంటూరు లో కొనుకున్నారు.

ఈ సినిమా హిట్ అయ్యి సుధీర్ కుడా సెట్ అయిపోతాడు అని మహేష్ చాలా ఆశగా ఉన్నాడట.

అందుకే ఎప్పుడు లేనిది ” ఒక్క కరెక్ట్ సినిమా పడితే , సుధీర్ స్టార్ అయిపోతాడు ” భలే మంచి రోజు ఆడియో ఫంక్షన్లో వాఖ్యనించాడు మహేష్.

అలాగే సుధీర్ బాలివుడ్ అవకాశాలు దక్కించుకోవడంతో చాలా సంతోషించాదంట మహేష్.ఇక ఈ సినిమా కుడా హిట్ అయిపోతే, బావని చూసుకుంటూ మురిసిపోతాడు మన సూపర్ స్టార్.

భలే మంచి రోజు ఈ నెల 25న విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube