మహేష్ - అల్లు అరవింద్ మధ్య ఏంటి గొడవ?

కొన్ని నెలల క్రితం అన్నౌన్స్ చేసారు మహేష్ బాబు – ఏఆర్ మురుగదాస్ సినిమా.మొదట్లో మహేష్ హీరోగా తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కి, హిందీలో, మళయాంలోకి డబ్ అవ్వాలి ఈ సినిమా.

 Mahesh Exits .. Allu Aravind Enters Arm’s Next In Hindi-TeluguStop.com

ఇప్పుడు ఈ లిస్టులోచి హిందీ వెళ్ళిపోయినట్లే

సినిమాని సల్మాన్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేయడం దాదాపు కన్ఫర్మ్.అయితే సల్మాన్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేద్దామనే ఆలోచన ఎవరిది? ఎన్వీ ప్రసాద్ హిందీలో చిత్రాన్ని నిర్మించట్లేదు .తెలుగు,తమిళ భాషల్లో తీసేసి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటారు.ఇంత సడన్ గా అల్లు అరవింద్ ఎంటర్ అయిపోయి హిందిలో ఠాగుర్ మధుతో పాటు కలిసి నేను నిర్మిస్తా అంటూ ముందుకొచ్చారు

ఇంతకుముందు మురుగదాస్ – అల్లుఅరవింద్ కలిసి హిందీలో ఆమీర్ ఖాన్ తో గజిని తీసారు.

ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవడంతో భారి లాభాలు వెనకేసుకున్నారు అల్లు అరవింద్.మురుగదాస్ ఇప్పుడు మహేష్ కోసం సిద్ధం చేసుకున్న కథ అత్యద్భుతంగా ఉందట.మరి అప్పట్లో ఆమీర్ ఖాన్ ని వాడుకున్నట్లు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని వాడుకుందామని అల్లు అరవిందే హిందీ రీమేక్ ప్లాన్ వేసారా? నిర్మాతల మధ్య ఏదో జరిగింది అంటున్నారు సినీ జనాలు .కాని అది ఏంటనేది బయటకి రావడం లేదు.మహేష్ హిందీలో ఉండటం అల్లు అరవింద్ కి ఇష్టం లేదా? మహేష్ డబ్బింగ్ వద్దు అన్నాడా? మురుగదాసే రీమేక్ చేద్దాం అనుకున్నారా? ఒకప్పుడు మురుగదాస్ సల్మాన్ కి చెప్పిన కథ ఇదేనా? ఇదే అయితే ఇన్నిరోజులు మౌనంగా ఎందుకున్నట్లు? కొంపదీసి మహేష్ బాబు – అల్లు అరవింద్ మధ్యలో గొడవలు లేవు కదా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube