మళ్ళీ డ్యాన్సులతో పరువు పోగొట్టుకోవడం వద్దు అంటున్న మహేష్

బాలనటుడిగా పరిచయం అయినప్పుడు మహేష్ బాబు మంచి డ్యాన్సర్.ఆకాలంలోనే ఫ్లోర్ స్టెప్స్ బాగా వేసేవాడు.

 Mahesh Doesn’t Want People To Troll His Dance In Spyder-TeluguStop.com

హీరోగా పరిచయం అయ్యేసరికి ఆ డ్యాన్సులు ఏమయ్యాయో మరి.గ్యాప్ వచ్చేసరికి పట్టు తప్పిందో లేక స్టార్ గా మారిన తరువాత బద్ధకం పెరిగిందో కాని ఆ తరువాత మహేష్ బాబు చేసిన డ్యాన్సుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవం సినిమాలోనే “బాలత్రిపురమని” పాటలో మహేష్ చేసిన స్టెప్పులు నవ్వుల పాలయ్యాయి.రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఈ స్టెప్స్ ని ఆడుకుంటే, సోషల్ మీడియాలో ఆ పాటని , అందులో మహేష్ చేసిన స్తేప్పులని ఇప్పటికే కామెడి చేస్తున్నారు.

కొంచెం ఫ్రాంక్ గా చెప్పాలంటే మహేష్ పరువ తీసిన డ్యాన్సులు అవి.

అందుకే స్పైడర్ సినిమాలో మళ్ళీ తప్పులు జరక్కుండా చూసుకుంటున్నాడట ప్రిన్స్.ఇంకా రెండు పాటలు మినహా స్పైడర్ షూట్ మొత్తం పూర్తయ్యింది కదా.మిగలిన పాటల్లో అద్భుతమైన స్టెప్స్ అవసరం లేదు కాని, మరీ పరువు తీసే స్టెప్స్ వద్దు అని మురుగదాస్ కి మరీ మరీ చెప్పాడట మహేష్.హీరో సూచనల మేరకు డ్యాన్స్ మాస్టర్ శోభితో చేర్చించిన మురుగదాస్, మహేష్ బాడి లాంగ్వేజ్ కి అనుగుణంగా, సింపుల్ గా ఉంటూనే, ఆకర్షణీయమైన స్టెప్స్ రూపొందించమని గట్టిగా చెప్పారట.అసలే నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న సినిమా కదా.అందులోనూ మహేష్ కి తమిళంలో తోలి స్ట్రెయిట్ సినిమా.పైగా హిందీలో జనాలకి నెగెటివ్ ఇంప్రెషన్ పడకూడదు.

ఇక్కడంటే మహేష్ మీద ఉన్న అభిమానంతో సర్దుకుపోతారు కాని మిగితా ఇండస్ట్రీలలో మెప్పించాలి కదా.అందుకే మహేష్ కొద్దిగా కష్టపడనున్నాడు.

ప్రస్తుతం ఇండియా, రషియా, అమెరికా దేశాల్లో గ్రాఫిక్స్ పనులు జర్పుకుంటున్న స్పైడర్, సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం.హిందీ, మళయాళ భాషల్లో భారి ఎత్తున విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి టీజర్ (మొన్న వచ్చింది కేవలం గ్లిమ్ప్స్) జులై చివరి వారంలో లేదా మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 9న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube