ఊరు దత్తత పేరుతో మహేష్ బాబు మోసం ? ఖర్చుపెట్టేది సొంత డబ్బు కాదు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా విడుదలైన ఓ నెల రోజులకి తన సొంత ఊరు, గుంటూరు జిల్లాకి చెందిన బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ తరువాత తెలంగాణలోని సిద్ధపూరంని కూడా మహేష్ దత్తత తీసుకున్నారు.

 Mahesh Babu’s Village Adoption Is A Drama ?-TeluguStop.com

దత్తత తీసుకున్న తరువాత కొన్నిరోజులకి బుర్రిపాలెంని సందర్శించిన మహేష్, గ్రామ ప్రజలపై వారాల జల్లు కురిపించారు.మొదటిరోజే 3-4 కోట్లు ఖర్చుపెట్టారు.

ఆ తరువాత హెల్త్ క్యాంప్స్, ఎడ్యుకేషన్ క్యాంప్స్ లాంటివి నిర్వాహిస్తూ వస్తోంది మహేష్ బాబు టీం.ఆ గ్రామప్రజలకు “మహేష్ బాబు హెల్త్ కార్డు పేరిట ఉచిత వైద్యం కూడా అందుతుందని అప్పట్లో హామీ ఇచ్చారు.అవన్నీ ఆచరణలో పెట్టారో లేదో తెలియదు కాని, ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్త మాత్రం మహేష్ బాబు అభిమానులను నొప్పించేదే.

బుర్రిపాలెం అనుకున్నంత వేగంగా ఏమి అభివృద్ధి చెందట్లేదు అంట.గ్రామంలో ఇప్పటికి సరైన రోడ్లు లేవట.జరిగిన ఒకటి రెండు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ నిధులతో మహేష్ బాబు బావ జయ్ గల్లా చేతుల మీదుగా జరిగినవే తప్ప, అందులో మహేష్ బాబు తన సొంత డబ్బులతో పెద్దగా చేసిందేమి లేదని టాక్.

ఇందులో నిజానిజాలు ఏమిటో మనకు మాత్రం సరిగా తెలియవు.

అభివృద్ధి కార్యక్రమాల సంగతి పక్కన పెడితే, దత్తత తీసుకున్న తరువాత ఒకటేసారి మహేష్ బుర్రిపాలెంని సందర్శించారు.సంవత్సరం గడిచిపోయింది .అప్పటినుంచి ఒక్కసారి కూడా బుర్రిపాలెం వైపు చూసింది లేదు.గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలు కూడా మోయాలి కదా, ఏమంటారు ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube