చిరంజీవికి 100 కోట్లు మహేష్ వల్లే వచ్చినట్టా?

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీనం150 బక్సాఫీస్ ని రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే.ఈ కత్తి రీమేక్ మరీ కత్తి అంతలా కుదరలేదని ఒరిజినల్ చూసినవారు విమర్శించినా, కనీసం 95% తెలుగు ప్రేక్షకులు కత్తి చూడలేదు కాబట్టి ఆ తప్పులని ప్రేక్షకులు పట్టించుకోలేదు.

 Mahesh Babu’s Rejection Earned 100cr For Chiranjeevi-TeluguStop.com

పైగా మెగాస్టార్ ని మళ్ళీ చూడాలనే కోరిక ముందు ఆ తప్పులన్నీ కొట్టుకుపోయాయి.అందుకే ఈ సినిమా శ్రీమంతుడు రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లతో బాహుబలి తరువాత రెండొవ అతిపెద్ద హిట్ గా నిలిచింది.

కాని మహేష్ కి రావాల్సిన 100 కోట్లు చిరంజీవికి వచ్చాయా?

మురుగదాస్ గజినీ తరువాత కాలం నుంచి మహేష్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు.కత్తి తమిళంలో విడుదల అవగానే రీమేక్ చెద్దామని మహేష్ దగ్గరికే వచ్చారు.

కాని మహేష్ కి రిమేక్స్ చేయడం ఇష్టం ఉండకపోవడం, అప్పుడే మురుగదాస్ హిందీలో సొనాక్షీతో “అకిరా” సినిమా ఒప్పుకోవడంతో ఆ రీమేక్ పక్కనపెట్టేసారు.ఆ తరువాత తెలుగులోకి డబ్ చేయాలనుకుంటే, అప్పుడే మురుగదాస్ ని విడుదల ఆపమని, నాకు రీమేక్ రైట్స్ కావాలని కోరారు.

మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి అడిగితే మురుగదాస్ మాత్రం కాదనగలరా? ఆరకంగా కత్తి చివరకి చిరంజీవి చేతిలో ఖైదీనం 150 గా తెరకెక్కింది.మహేష్ వదులుకున్న సినిమాతో మెగాస్టార్ 100 కోట్లు సాధించారు.

అయితే ఈ విషయం మీద మహేష్ ఏమి బాధపడట్లేదు.ఎందుకంటే “స్పైడర్” కి మంచి టాక్ వస్తే ఆ వంద కోట్లు కష్టమైన విషయం ఏమి కాదు.

తెలుగు – తమిళ భాషలు కలిపి ఈ సినిమా 120 కోట్లకు పైగానే బిజినెస్‌ చేయనుంది.సినిమాకి టాక్ వస్తే 130-150 కోట్ల మధ్య, ఎంత వసూలు చేస్తుందో స్పైడర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube