సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పెద్ద ప్లాన్ వేసారు.ఒకేసారి తమిళ, హిందీ భాషల్లో మార్కెట్ పెంచుకునే మాస్టర్ ప్లాన్ వేసారు.
గత కొన్నిరోజులుగా మురుగదాస్ తో మహేష్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా నిజంగానే ఉంటుందా లేక గాలి వార్తలా అనే ప్రశ్న అభిమానుల్ని వెంటాడింది.
మహేష్-మురుగదాస్ కాంబినేషన్ సెట్ అయిపొయింది.ఇది ఏమాత్రం అవాస్తవం కాదు.
బ్రహ్మోత్సవం తరువాత మహేష్ మొదలుపెట్టే సినిమా ఇదే.ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.ఏకకాలంలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందిస్తారు.హిందీలో డబ్ చేస్తారు.ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మిస్తారు.
ఎలాగో మురుగదాస్ తమిళంలో టాప్ డైరెక్టర్, అలాగే హిందీలో కుడా మంచి పేరు ఉంది.
మురుగదాస్ పేరుకి మహేష్ మార్కెట్ కలిస్తే , ఇంకేమైనా ఉందా … రికార్డులు ఏరులై పారుతాయి.తద్వారా మహేష్ కి తమిళంలో కుడా మంచి మార్కెట్ మహేష్ కి వచ్చేస్తుంది.
హిందీ జనాల్లో ఎలాగో ఫేమస్ కాబట్టి అదింకా బలపడుతుంది.వినాయక్,త్రివిక్రమ్,పూరి లాంటి దర్శకులని మహేష్ పక్కనపెట్టడానికి ఇదే కారణం .ఎలా ఉంది సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్.