చిరంజీవికి పెద్ద పంచ్ విసిరిన మహేష్ బాబు

మెగాస్టార్ చిరంజీవి .ఆ పేరు చాలు ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించటానికి.తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోని, దశబ్దాలపాటు నెం.1 స్థానంలో బాక్సాఫీసుని ఏలిన ఘనత మెగాస్టార్ ది.ఆయన ఉన్నంత కాలం ఆయనకి పెద్దగా ఎవరు పోటినివ్వలేకపోయారు.అయితే ఒకనాటి క్రేజ్ ఇప్పటికి అలానే ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం 150వ సినిమా విడుదలైతే కాని చెప్పలేం.అయితే, మెగాస్టార్ 150వ సినిమా కంటే, సూపర్ స్టార్ 23వ సినిమా మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు బయ్యర్లు.

 Mahesh Babu’s Film Gets Record Price Keeping Chiranjeevi Aside-TeluguStop.com

ఈస్ట్ గోదావరి ట్రేడ్ ఏరియాలో ఇప్పటివరకు హయ్యెస్ట్ థియేట్రికల్ రైట్స్ రాబట్టిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.5.40 కోట్లకు అనుశ్రీ సంస్థ ఈ చిత్ర హక్కులను చేజిక్కించుకుంది.ఇప్పుడు వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చేస్తున్న కత్తి రీమేక్ కి ఇదే ఏరియాలో ఇదే అనుశ్రీ ఫిలిమ్స్ దాదాపుగా 5.50 కోట్లు చెల్లిస్తోందట.సర్దార్ కంటే 10 లక్షలు ఎక్కువే.అయితే రికార్డు మాత్రం కాదు.

సూపర్‌ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతున్న చిత్రానికి ఇదే ఈస్ట్ గోదావరి హక్కుల కోసం 5.75 కోట్ల నుంచి 6 కోట్ల దాకా చెల్లిస్తోందట వింటేజ్ ఫిలిమ్స్ సంస్థ.ఇదే కొత్త రికార్డు.ఈరకంగా మెగాస్టార్ ఇలా వస్తూనే అలా పంచ్ వేసేసాడు మహేష్ బాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube