మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాలా కాంబినేషన్ లో వస్తున్న బ్రహ్మోత్సవం సినిమా మీద ఫాన్స్ కి విపరీతమైన హైప్ ఉంది.దానికి కారణం లేకపోలేదు.
ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమా ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ స్థాయిని పెంచడమే దీనికి ప్రధాన కారణం.అయితే మహేష్ అభిమానులకి మరొక సూపర్ ఆఫర్ ఇస్తున్నాడు మహేష్ బాబు.
నేనొక్కడినే సినిమా లో తన కొడుకు గౌతం తో అరంగేట్రం చేయించిన మహేష్ ఈ సినిమా లో కూతురు సితారని పరిచయం చేయాలని మహేష్ బావిస్తున్నట్లు మరి ఎలా బయటకు వచ్చిందో ఓ ఫీలర్ వచ్చింది.మహేష్ కు వున్న ఫ్యాన్ బేస్ రీత్యా ఈ వార్త చకచకా పాకిపోయింది.
మరి నిజమో కాదో క్లారిటీ ఇవ్వాల్సింది మహేష్ మాత్రమే.వేసవి విడుదల కోసం బ్రహ్మోత్సవం చకచకా ముస్తాబు అవుతోంది.