బ్రూస్ లీ శ్రీమంతుడు ని దాటే అవకాశాలు ఎక్కువా ? తక్కువా ?

సూపర్ స్టార్ మహేష్ అదోరకం బ్లాక్బస్టర్ శ్రీమంతుడు బిజినెస్ దాదాపుగా ఆగిపోయినట్టే.85-90 కోట్ల మధ్య షేర్ కలెక్షన్లతో చాలా పెద్ద హిట్ కొట్టేసాడు మహేష్.మళ్ళి ఈ రికార్డులను కొట్టాలి అంటే పవన్ కళ్యాన్ వల్లే అవుతుందని అనుకున్నారంతా.కాని నేనున్నాను అంటూ వచ్చేసాడు చరణ్

 What Are The Chances Of Bruce Lee Crossing Srimanthudu..?-TeluguStop.com

బ్రూస్ లీ మహేష్ రికార్డులను కొట్టే అవకాశాలు ఎంత ?


నైజాంలో చరణ్ మార్కెట్ బాగున్నా, అది మహేష్ ,పవన్ ల రేంజ్ మార్కెట్ కాదు.కాని చిరంజీవి స్పెషల్ అపియరెన్స్ ఉండటంతో అవకాశాల్ని కొట్టిపడేయలేము.బెనిఫిట్ షోస్ శ్రీమంతుడు తో పోలిస్తే చాలా తక్కువ పడేలా ఉన్నాయి.

అందువల్ల శ్రీమంతుడు తోలి రోజు నైజాంలో చేసిన 5కోట్లకు పైగా షేర్ వసూళ్ళు బద్దలు అవకపోవచ్చు.
ఓవర్సీస్ మార్కెట్ లో బాహుబలికి మించి ప్రీమియర్స్ వేసే పనిలో ఉన్నారు.

చరణ్ మార్కెట్ అంతంతమాత్రమె కావడంతో ఒక అంచనాకి ఇప్పుడే రావడం కష్టం.కాని ఎట్టి పరిస్థితుల్లో అయినా బ్రూస్ లీ రామ్ చరణ్ కి మొదటి మిలియన్ డాలర్ల సినిమా అవుతుంది ఇక్కడ

ఉత్తరాంధ్ర,సీడెడ్, నెల్లూరు రామ్ చరణ్ కి కంచుకోటలు.

ఇక్కడ శ్రీమంతుడు బద్దలు అవడం ఖాయంగా కనిపిస్తోంది.ఈస్ట్,వెస్ట్,కర్ణాటక, పరిస్థితి సినిమాకి బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప మహేష్ ని దాటడం కష్టమే

ఓవరాల్ గా చెప్పాలంటే సెలవులు ఉండటంతో మంచి ఊపు ఉంటుంది కలెక్షన్లలో, దానితో పాటు మెగాస్టార్ చాలా ప్రభావితం చేయొచ్చు ఓపెనింగ్స్ మీద.మరి పవన్ రాకముందే మేగాఫ్యాన్స్ ఆశలు రామ్ చరణ్ తీరుస్తాడా లేదా చూడాలి !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube