Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వేటాడేందుకు మహేష్ వెంటే పడుతున్న పవన్-Mahesh Babu Vs Pawan Kalyan Clash For This Dussehra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటిపడితే చూడాలని ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇద్దరు పోటీలో ఉండి, ఇద్దరు హిట్ కొడితే టాలివుడ్ కి అంతకన్నా ఏం కావాలి. ఎప్పుడో 2006 లో పోటిపడ్డారంటే, మళ్ళీ ఇద్దరు తక్కువ గ్యాప్ లో సినిమాలు రిలీజ్ చేసింది లేదు. అయితే ఈసారి ఇద్దరి మధ్య పోటి తప్పేలా లేదు. కాని మనం ముందు అనుకున్నట్లుగా వచ్చే ఏడాది సంక్రాంతికి కొరటాల సినిమా, త్రివిక్రమ్ సినిమాతో పోటిపడేలా లేరు వీళ్ళు. ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ పోటి ఇదే ఎడాది జరిగేలా ఉంది.

జూన్ రావాల్సిన మహేష్ స్పైడర్ దసరాకి ఫిక్స్ అయ్యింది. మొన్న విడుదల చేసిన టీజర్ లో కూడా దసరా విడుదల అని ప్రకటించారు. సెప్టెంబర్ 27న సినిమా విడుదల అని బయ్యర్లకు మెసెజ్ కూడా పంపించారు. దాంతో మహేష్ కి పోటిగా కేవలం బాలకృష్ణ (పూరి జగన్నాథ్ సినిమా) ఉంటారు అని అనుకుంటున్న సమయంలో సడెన్ ఎంట్రి ఇచ్చాడు పవర్ స్టార్. వచ్చే ఏడాది సంక్రాంతికి కాదు, ఇదే ఏడాది దసరాకి సినిమాని పోటీలోకి దింపుతారట. సెప్టెంబరు 21 విడుదల తేది అని ట్రెడ్ వర్గాలకు సమాచారం వెళ్ళింది.

ఈరకంగా మహేష్ ఎటు వెళితే అటే వస్తున్నాడు పవన్. ముందు భరత్ అనే నేను సినిమాతో సంక్రాంతికి పోటిపడాలనుకోని, ఆ తరువాత స్పైడర్ వైపు తిరిగాడు పవర్ స్టార్. రెండు హిట్ అయితేనే మంచిది. రెండిటి మీద రికార్డు రేట్లు పెడుతున్నారు బయ్యర్స్. విషయం తేడా కొడితే మరోసారి సర్దార్, బ్రహ్మోత్సవం కథ రిపీట్ అవుతుంది. చూడాలి మరి ఈ వేటలో వేటగాడు ఎవరో, వేటకి బలయ్యేది ఎవరో!

Continue Reading
More Posts
To Top