Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మహేష్ బాబుని నిండా ముంచిన నరేంద్ర మోడి-Mahesh Babu To Suffer Huge With GST Bill

GST బిల్ వివరాలు మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. సినిమా టికెట్లపై 28% ట్యాక్స్ విధించనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అంటే ఇంతకు ముందులా స్టేట్ ని బట్టి సినిమా మీద ట్యాక్స్ మారదు అన్నమాట. ఉదాహారణకు చెప్పాలంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 15% ట్యాక్స్ విధిస్తారు టికేట్లపైన. మహారాష్ట్రలో హిందీ సినిమాలకు 45% విధిస్తారు. చూడండి .. ఎంత తేడా ఉందో. అదే బీహార్ అయితే ఏకంగా 50% వినోదపు పన్ను చెలామణీలో ఉంది. ఉత్తర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో 30% ఉంది. ఇలా రాష్ట్రాలను బట్టి వినోదపు పన్నులో మార్పులుంటాయి. కాని GST అమలు మొదలయ్యాక ఇలా తేడాలు ఉండవు. దేశం మొత్తంలో ఏ భాషకి చెందిన సినిమా అయినా, 28% GST కట్టాల్సిందే. ఈకొత్తరం ట్యాక్స్ నిబంధనలు జులై 1వ తేది నుంచి అమలులోకి వస్తాయి.

దీనివలన తెలుగు సినిమాకి లాభామా నష్టమా? అందులోను మహేష్ బాబుకి స్పెషల్ గా జరిగిన నష్టం ఎమిటి? ఇవేగా మీ ప్రశ్నలు. వచ్చిన గ్రాస్ కలెక్షన్ల నుంచి ఇప్పటిదాకా 15% మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేవారు. ఇప్పుడు 28% చెల్లించాలి. అంటే ప్రతి టికేట్ మీద 13% ఆదాయం కోల్పోతారు. 100 రూపాయల టికేట్ లో 72 రూపాయలు నెట్. ఇప్పుడు అందులోంచి థియేటర్ ఖర్చులు చెల్లించాలి. ఆ తరువాత డిస్ట్రీబ్యూటర్, నిర్మాత మధ్య ఉన్న ఒప్పందాన్ని బట్టి (MG, SG, Advance) షేర్ పంచుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే షేర్, ఆదాయం, నెట్ .. అన్ని 13% తగ్గుతాయి. ఇది చాలా పెద్ద దెబ్బ.

ఇక మహేష్ బాబుకి జరిగిన స్పెషల్ నష్టం ఏమిటంటే, స్పైడర్ వాయిదా పడి 13% నష్టపోతోంది. ఈ బిల్ గురించి, ఆ సవరణల గురించి తెలియకుండా రికార్డు స్థాయి చెల్లింపులు చేసారు బయ్యర్లు. డీల్స్ అన్ని ముందున్న ట్యాక్స్ సిస్టమ్ లెక్కలతో చేసుకున్నవే. ముందు అనుకున్నట్లుగా స్పైడర్ ఏప్రిల్ లో వచ్చి ఉంటే ఈ తలకాయనొప్పి ఉండేది కాదు. కనీసం జూన్ 23న వస్తే ఒక వారంరజులు భారీ షేర్ కలెక్షన్లు సాధించేది. ఇప్పుడు వాయిదా వేసుకోని తమ కాలి మీద తామే సుత్తితో కొట్టుకున్నట్లు అయ్యింది. అదీకాక స్పైడర్ తమిళనాట కూడా 28% పన్నుకి బలవుతుంది. ద్విభాష చిత్రం కదా.

జై లవ కుశ, పవన్ – త్రివిక్రమ్ సినిమా .. ఇకనుంచి రాబోయే పెద్ద సినిమాలు కొనేముందు బయ్యర్లు GST ని దృష్టిలో పెట్టుకోని తక్కువ డబ్బు పెడతారు. స్పైడర్ మాత్రం వంద కోట్లకు పైగా బడ్జెట్, 130-150 కోట్ల బిజినెస్ తో రిస్కులో పడింది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • Genral

  Why we Shouldnt Pour Laundry Water on Feet

  By

  సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

 • Genral

  8 biggest myths around alcohol

  By

  మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్). విస్కీ,...

 • Genral

  PLANTIX – a must have app for all farmers for their needs and doubts

  By

  అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు,...

 • Genral

  Broom stick shouldn’t touch feet. Why?

  By

  మన పెద్దవాళ్ళు తరచూ చెప్పుతూ ఉంటారు. చీపురు లక్ష్మి స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని అంటారు. కానీ చాలా మంది దీనిని...

To Top