నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా ?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఊహించని విధంగా బొక్కబోర్లాపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు పంపిణిదారులు .సినిమాకి పెట్టినదాంట్లో అతికష్టం మీద సగం తిరిగివచ్చేలా ఉన్నాయి .

 Mahesh Babu To Compensate The Distributors Along With Producer-TeluguStop.com

ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లి నిర్మాత పివిపిని ఆశ్రయించారు బయ్యర్లు .మొదట వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబుతో సినిమా తీసి , దాంతో నష్టపరిహారం చెల్లిస్తానని నిర్మాత అడగ్గా దాన్ని తిరస్కరించారు బయ్యర్లు .చివరకి 40% కన్నా ఎక్కువ నష్టాలు వస్తే ఆ పంపిణిదారుడికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు నిర్మాత .

ఇక తాజాగా అందిన సమాచారం ఏంటంటే , నష్టాల భారం కేవలం నిర్మాతపైనే రుద్దట్లేదు మహేష్ .సగభాగం నిర్మాత ,సగ భాగం మహేష్ చేల్లిస్తారట బయ్యర్లకి .మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీవర్గాలు హర్షం వ్యక్తం చేసాయి .

ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో పాటు సేదదీరుతున్న ప్రిన్స్ , హైదరాబాద్ కి వచ్చిరాగానే బయ్యర్లకి సహాయం అందిస్తారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube