" మహేష్ బాబు మీద అన్నీ పుకార్లే "

మహేష్ బాబు తరవాత సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన హీరో సుదీర్ బాబు.భలే మంచి రోజు అనే సినిమా తో ఒక మోస్తరు విజయం సొంతం చేసుకున్న ఇతను ఈ సినిమా తరవాత ఇంకా ఏదీ సంతకం పెట్టలేదు.

 Mahesh Babu – Sudheer Babu Clarification-TeluguStop.com

భలే మంచి రోజు లాంటి కామెడీ – యాక్షన్ ఎంటర్టైనర్ ని జనం ఓకే చెయ్యడం తో అలాంటి మరొక కథ కోసం మనోడు సిద్దం అవుతూ ఉన్నాడు .

అయితే ఈ లోగా మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా సుదీర్ ఒక సినిమా తీస్తున్నాడు అనీ శ్రీను వైట్ల దానికి డైరెక్టర్ గా ఉంటాడు అనీ పుకార్లు షికారు చేస్తున్నాయి.కాగా ఇదే విషయమై స్పందిస్తూ సుధీర్, ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.దర్శకుడు శ్రీనువైట్లతో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు, ఆ సినిమాను మహేష్ నిర్మించబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అది పుకారని స్పష్టం చేశారు.

ఈ కాంబినేషన్ వినడానికి బాగున్నా, అలాంటి డిస్కషన్ ఇప్పటివరకూ రాలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ట్విట్టర్ వేదికగా చేసుకొని ఆయన పై ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన నెక్స్ట్ సినిమా ఏదనేది ఇంకా కన్‌ఫర్మ్ కాలేదని, త్వరలోనే ఆ విషయం వెల్లడిస్తానని సుధీర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube