మహేష్ బాబు తరవాత సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన హీరో సుదీర్ బాబు.భలే మంచి రోజు అనే సినిమా తో ఒక మోస్తరు విజయం సొంతం చేసుకున్న ఇతను ఈ సినిమా తరవాత ఇంకా ఏదీ సంతకం పెట్టలేదు.
భలే మంచి రోజు లాంటి కామెడీ – యాక్షన్ ఎంటర్టైనర్ ని జనం ఓకే చెయ్యడం తో అలాంటి మరొక కథ కోసం మనోడు సిద్దం అవుతూ ఉన్నాడు .
అయితే ఈ లోగా మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా సుదీర్ ఒక సినిమా తీస్తున్నాడు అనీ శ్రీను వైట్ల దానికి డైరెక్టర్ గా ఉంటాడు అనీ పుకార్లు షికారు చేస్తున్నాయి.కాగా ఇదే విషయమై స్పందిస్తూ సుధీర్, ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.దర్శకుడు శ్రీనువైట్లతో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు, ఆ సినిమాను మహేష్ నిర్మించబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అది పుకారని స్పష్టం చేశారు.
ఈ కాంబినేషన్ వినడానికి బాగున్నా, అలాంటి డిస్కషన్ ఇప్పటివరకూ రాలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ట్విట్టర్ వేదికగా చేసుకొని ఆయన పై ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన నెక్స్ట్ సినిమా ఏదనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని, త్వరలోనే ఆ విషయం వెల్లడిస్తానని సుధీర్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.