” నేను ఆయన్ని కేవలం ఒక బైట్ అడిగాను, కాని నేను స్వయంగా వస్తాను ఆడియో ఫంక్షన్ కి అన్నారు, నాలాంటి వాణ్ని ఇంత ఎంకరేజ్ చేస్తారు అనుకోలేదు” అఖిల్ మహేష్ బాబు గురించి అన్న మాటలివి.కుర్రాడిలో ఏం నచ్చిందో ఏమో మరి .
తెగ సపోర్ట్ చేస్తున్నాడు మన సూపర్ స్టార్.
ఇటివలే కొరటాల శివ మహేష్ కి ఒక కథ చెబితే, మనం మళ్ళి అప్పుడే సినిమా చేస్తే అంచనాలు విపరీతంగా ఉంటాయి, కాస్త గ్యాప్ మేంటైన్ చేద్దాం, మీరూ ఒక సినిమా అఖిల్ తో ప్లాన్ చేయండి, కుర్రాడిలో మంచి ఈజ్ ఉంది అని సలహా ఇచ్చాడట మహేష్.
ఈ విషయంపై కొరటాల కుడా ఆలోచనలో పడ్డాడట.
ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభమవుతున్న మాట అభిమానులే చెబుతున్నారు కాని ఇంతవరకు కొరటాల ఈ విషయంపై స్పంచించలేదు.మరోవైపు ఎన్టీఆర్ కన్నా అఖిల్ వైపే కొరటాల మొగ్గు చూపుతున్నారని ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్నాయి.అసలేం జరుగుతుందో కొరటాల కే తెలియాలి.