‘బాహుబలి’పై మహేష్‌ ట్వీట్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన సినిమాలను తప్ప మరే హీరో సినిమాలను పట్టించుకోడు.తన సినిమాలేదో తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు.

 Mahesh Praises Baahubali Team-TeluguStop.com

అప్పుడప్పుడు మాత్రమే ఇతర సినిమా గురించి స్పందిస్తూ ఉంటాడు.ఏదైనా సినిమాపై మహేష్‌ స్పందించాడు అంటే ఆ సినిమాకు అంతకంటే పెద్ద ప్రమోషన్‌ ఏమీ ఉండదు.

ఇటీవలే తన బావ నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాపై మహేష్‌బాబు సింపుల్‌గా స్పందించాడు.ఇక తాజాగా ‘బాహుబలి’పై మాత్రం ప్రశంసతో ట్వీట్స్‌ వర్షం కురిపించాడు.

సిట్జర్లాండ్‌ నుండి తాజాగా వచ్చిన మహేష్‌బాబు వచ్చి రాగానే ‘బాహుబలి’ సినిమాను చూశాడు.టాలీవుడ్‌ సినిమాకు ఇంతటి స్థాయిలో కలెక్షన్స్‌ వస్తాయని తాను ఊహించలేదని, ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి.

ఈ సినిమాను తీసిన రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వాడు కావడం గర్వకారణం.కీరవాణి గారి సంగీతం చాలా బాగుందని, ప్రభాస్‌, రానా నటన అద్బుతం.

వారి కష్టానికి ప్రతిఫం దక్కిందని, చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశాడు.ఒక సినిమాపై మహేష్‌బాబు ఇంతగా స్పందించడం ఇదే ప్రథమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube