ఒక్క "పేరుతో" మహేష్ అన్నికోట్లు పోగొట్టుకుంటాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు 23వ చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది.ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తుండగా, రకుల్ ప్రీత్ ఇందులో మహేష్ కి జోడిగా కనబడనుంది.

 Will Mahesh Babu Lose Crores Of Money For That Title?-TeluguStop.com

వంద కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ తెలుగు – తమిళ ద్విభాష చిత్రం జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక విషయంలోకి వెళితే, ముందునుంచి అనుకున్నట్లుగానే ఫిలిం చాంబర్ లో ఈ సినిమా కోసం “స్పైడర్” (Spyder) అనే టైటిల్ ని రిజిస్టరు చేయించారు నిర్మాతలు.

ఇందులో మహేష్ ఒక స్పై పాత్రను పోషిస్తుండటం, ఆ పాత్ర స్పైడర్ సెన్స్ ఉన్నది కావడంతో కథకి అనుగుణంగా ఈ టైటిల్ నే ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.ఈ టైటిల్ తో తెలుగు వెర్షన్ కి ఇబ్బందేమి లేదు కాని, తమిళ వెర్షన్ తోనే పెద్ద సమస్య ఉంది.

దీని వలన మహేష్ సినిమా కోట్లు పోగొట్టుకుంటుంది.

విషయం ఏమిటంటే, సినిమాకి తమిళ పేరు పెడితే తమిళనాడులో వినోదపు పన్ను మాఫీ చేస్తుంది ప్రభుత్వం.

స్పైడర్ అనేది ఇంగ్లీషు పదం కదా, ఈ టైటిల్ నే తమిళ వెర్షన్ కి కూడా పెట్టేస్తే 15% శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ ఈ సినిమా తమిళనాడులో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే .అందులో 7.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి.అదే స్పైడర్ కి బదులు ఏదైనా తమిళ పేరు పెడితే ఆ 15% శాతం బాక్సాఫీస్ కలెక్షన్లు గవర్నమెంటుకి ఇవ్వాల్సిన పని లేదు.

ఈ విషయం మీదే ఆలోచిస్తున్నారు మహేష్ 23 యూనిట్ సభ్యులు.

సినిమాకి అంతట ఒకే టైటిల్ ఉంటే హైప్ బాగుంటుంది.రెండు వేరే పేర్లు పెడితే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అని అనుకున్నా అనుకుంటారు సోషల్ మీడియా వాడని జనాలు.

మరి ఇంగ్లీషు పేరు పెడితేనేమో కోట్లు వదిలేయాలి.ఈ చిక్కుముడి వీడట్లేదు కాబట్టే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంతవరకు రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube