సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంతా ఫ్యామిలి మ్యాన్ అంటుంటారు.నిజమే మరి .
కుటుంబంతో మహేష్ గడిపినట్టు ఇంకే స్టార్ హీరో గడపడేమో.కాస్త వీలు చిక్కినా, భార్య పిల్లలని తీసుకొని షికారుకి వెళ్ళడం మహేష్ కి అలవాటు.
మళ్ళి షికారు అంటే అలాంటి ఇలాంటి షికారు కాదు.షూటింగ్ లేనప్పుడు ఒకేసారి 3,4 దేశాలు తన కుటుంబంతో చుట్టేసి వస్తాడు మహేష్.
మహేష్ కి తన కూతురు సితార అంటే ప్రాణం.ఇంట్లో ఉన్నాడంటే తనతో ఆటలాడేస్తూ గడిపేస్తూ ఉంటాడు.
ఇక ఇంట్లోనే కూర్చొని తనకి మాత్రమే ఇష్టమైన సినిమాలు చూసేస్తూ ఉండటం మహేష్ కి ముందు నుంచి ఉన్న అలవాటు.కాని సితార కోసం తన అలవాటు ని కాస్త మార్చుకున్నాడు.
మహేష్ తన ఇంట్లో సితారతో కలిసి సినిమాలు చూస్తున్నాడట.అవి కూడా చిన్న పిల్లల సినిమాలు.“బార్బీ” “ఫ్రోజెన్” .ఇదిగో ఇలాంటి హాలివుడ్ యానిమేషన్ సినిమాలు.
” సితార మా ప్రపంచానికి స్టార్.నేను, తను ఇంట్లో ఉన్నామంటే కూర్చొని సినిమాలు చూస్తున్నాం.
నేను చూసే సినిమాలు కాకపోయినా, తనకోసం “బార్బీ” , “ఫ్రోజెన్” లాంటి సినిమాలు చూస్తున్నా.తనతో కలిసి సినిమాలు చూస్తే తనకి అదో ఆనందం” అంటూ మురిసిపోయాడు మహేష్.