Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

కొత్త బిజినెస్ లోకి మహేష్ బాబు .. అల్లు, దిల్ రాజు ఆగడాలకు చెక్ పెట్టేందుకే ?.-Mahesh Babu Into Theater Chain Business

Telugu Gossips

నిజమో, అబద్ధమో .. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పాపులర్ రూమర్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు చేతిలోనే ఉంటాయని అంటారు. చిన్న సినిమాలకి థియేటర్లు దొరక్కపోవడానికి వీరే కారణం అని దాదాపు ప్రతి చిన్న సినిమా ఫంక్షన్ జనాలు వీరిపైన దండయాత్ర చేస్తరు. మొన్నటికిమొన్న ఆర్ నారాయణమూర్తి కూడా మెగా ఫ్యామిలి, నందమూరు ఫ్యామిలి మీద చిన్న సినిమాలకి థియేటర్ల కొరత అనే టాపిక్ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలాంటి వేడిలో మహేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, మహేష్ కలిసి తమ భాగస్వామ్యంలో ఓ పెద్ద థియేటర్ చైన్ ని మొదలుపెట్టనున్నారట. సినిమా ఇండస్ట్రీ ప్రతి పెద్ద ఫ్యామిలి చేతిలో థియేటర్లు ఉన్నాయి. తన దగ్గర మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నాడేమో .. ఈ ప్లాన్ వేసాడు. రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా వందలకొద్దీ కొత్త థీయేటర్లు ప్లాన్ చేస్తున్నారు. ఎంతైనా ఒక సూపర్ స్టార్ నిర్మించే థీయేటర్లు కాబట్టి, ఇవి అధునాతన హంగులతో, టెక్నాలజితో ఉంటాయని మనం ఆశించొచ్చు.

ఈ విషయం మీద నిర్మాత సీఎన్ రావు మాట్లాడుతూ, మిగితా సినీ కుటుంబాల లాగా కాకుండా, మహేష్ చిన్న సినిమాలకి థియేటర్లు అందుబాటులో ఉంచి, ఇండస్ట్రీ బాగు కోసం పాటుపడతాడని అభిప్రాయపడ్డారు. అంతా బానే ఉంది కాని, భవిష్యత్తులో ఎవరు ఎలా ఉంటారో మనకేం ఎరుక. మిగితా వార్తల్లోకి వెళితే, ఎప్పుడెప్పుడా అని అభిమానులని ఊరించిన మహేష్ 23 టైటిల్, ఫస్ట్ లుక్ .. రెండూ రేపు (12th ఏప్రిల్) సాయంత్రం 5 గంటలకి విడుదల కానున్నాయి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu Gossips

  • Gossips

    Mega Fans Negative Talk on Baahubali

    By

    బాహుబ‌లి….బాహుబ‌లి…బాహుబ‌లి ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా వారి నోటి వెంట ఇదే మాట విన‌ప‌డుతోంది. తొలి పార్ట్ రూ.600 కోట్ల వ‌సూళ్లు,...

  • Gossips

    Nithin to lead Janasena in Telangana?

    By

    ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పరమభక్తుల్లో హీరో నితిన్ ఒకరు. ఇష్క్ సినిమా నుంచి మొదలు, పవర్...

  • Gossips

    Srinu Vaitla sold his house for clearing debts

    By

    అగ్రదర్శకుడు శ్రీనువైట్ల టైమ్ అస్సలు బాగాలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే ఆయన ఇంటికి వాస్తు బాగాలేదు. ఆగడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న సమయంలో...

  • Gossips

    Mahesh Babu as Lord Krishna in 1000cr Mahabharata?

    By

    వెండితెరపైకి మహాభారతం కథని తీసుకురావాలి .. ఇదే రాజమౌళి, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల డ్రీమ్ ప్రాజెక్టు. మరికొన్నేళ్ళ వరకు...

To Top