మహేష్ బాబు నటన నచ్చట్లేదు అంటున్న అభిమానులు

మహేష్ బాబు మంచి నటుడు.అందులో సందేహం లేదు.

 Mahesh Babu Fans Disappointed With His “subtle” Acting-TeluguStop.com

మంచి నటుడు కాబట్టే, అవార్డుల విషయంలో ఈ తరంలో ఉన్న అందరు నటుల కంటే ఎత్తులో నిలుచున్నాడు సూపర్ స్టార్.కాని, మహేష్ నటనపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

అది కూడా వేరే ఎవరో కాదు, మహేష్ వీరాభిమానులే మహేష్ నటనశైలిని చూసి పెదవి విరుస్తున్నారు.ఒకప్పటి మహేష్ కి, బ్రహ్మోత్సవం నుంచి చూస్తున్న మహేష్ కి చాలా తేడా ఉందని అంటున్నారు.

విషయం ఏమిటంటే, ఆగడులో మహేష్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు.అది కూడా గట్టిగా.

అప్పుడు మహేష్ నటనపై చాలా విమర్శలు వచ్చాయి.అంతలా అరవడం ఏంటి అనే కామెంట్స్ వలన, శ్రీమంతుడులో పాత్ర స్వభావం వలన, మెల్లిగా, నెమ్మదిగా మాట్లాడాడు మహేష్.

ఆ సినిమా హిట్ అవడమే కాదు, మహేష్ నటనకి అవార్డులు, ప్రశంసలు దక్కాయి.

ఆ సినిమాకి ప్రశంసలు దక్కాయి కదా అని అదే తరహాలో సబ్టిల్ గా ఉండేందుకు ప్రయత్నించాడు బ్రహ్మోత్సవంలో.

ఆ సినిమాకి కూడా విమర్శలు వచ్చినా, మరెందుకో తెలియదు, ఇటివలే వచ్చిన అభి బస్ యాడ్స్ లో కూడా సబ్టిల్ గా ఉండేందుకు ప్రయత్నించాడు మహేష్.ఇక్కడే మహేష్ ఫ్యాన్స్ కి మండింది.

ట్విట్టర్ లో ఏకంగా మహేష్ కే ట్వీట్స్ పెడుతున్నారు.పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్ మెన్ తరహాలో ఎనర్జెటిక్ గా ఉండమని, ఇలా సబ్టిల్ నటన వద్దు అని.మరి మహేష్ అభిమానుల మాట విని, మురుగదాస్ సినిమాలో కొత్తరకంగా ప్రయత్నిస్తున్నాడో లేదో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube