మహేష్‌ డబుల్‌ గిఫ్ట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్‌బాబు తన సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం గత కొంత కాలంగా చూస్తూ వస్తున్నాం.తాజాగా నిన్న జరిగిన కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ పోస్టర్‌తో పాటు టీజర్‌ కూడా విడుదల అయ్యింది.

 Mahesh Babu Double Gift To Fans-TeluguStop.com

పోస్టర్‌తో పాటు, టీజర్‌కు కూడా అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది.ఇక ఇదే పుట్టిన రోజున మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు మరో కానుక ఇవ్వడం జరిగింది.

‘శ్రీమంతుడు’ తర్వాత తాను నటించబోతున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్‌లుక్‌ను మహేష్‌బాబు విడుదల చేయడం జరిగింది.మహేష్‌బాబు, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఒకే రోజు రెండు సినిమాల ఫస్ట్‌లుక్‌లు విడుదల అవ్వడంతో సూపర్‌ ఫ్యాన్స్‌ సూపర్‌ హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు.‘శ్రీమంతుడు’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, వచ్చే నెలలోనే ‘బ్రహ్మోత్సవం’ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరితో కలిసి మహేష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.విజయవాడ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ఇప్పటికే శ్రీకాంత్‌ అడ్డాల ప్రకటించాడు.

ప్రస్తుతం లొకేషన్స్‌ హట్టింగ్‌ జరుగుతోంది.ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని శ్రీకాంత్‌ భావిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube