Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కొత్త సంవత్సరంలో అది మానేసిన మహేష్‌-Mahesh Babu Decided To Quit Smoking

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో ఏదైన ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని అంతా అనుకుంటారు. ఎక్కువ మంది కొత్త సంవత్సరంలో అది మానేయాలి లేక ఇది స్టార్ట్‌ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే వాటికి ఎక్కువ మంది ఫాలో అవ్వకుండా వదిలేస్తారు. అయితే మహేష్‌బాబు కొత్త సంవత్సరంలో తనకు బాగా ఇష్టమైన సిగరెట్‌ను వదిలేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

చైన్‌ స్మోకర్‌ అయిన మహేష్‌బాబు ఇకపై సిగరెట్‌ను ముట్టకూడదని నిర్ణయించుకున్నాడు. గతంలో బాగా తాగే మహేష్‌ ఆ మద్య భార్య నమ్రత ఒత్తిడితో కొద్దిగా తగ్గించాడు. ఆ తర్వాత ఇంట్లో కాకుండా బయట ఉన్న సమయంలో సిగరెట్లు తాగుతూ వస్తున్నాడు. ఇకపై ఇంట్లో, బయట ఎక్కడ కూడా సిగరెట్లు తాగనని ప్రతిజ్ఞ చేసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు ఒక ఇంగ్లీష్‌ దిన పత్రికకు తెలియజేయడం జరిగింది. మహేష్‌ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకు కృషి చేస్తానని, సినిమాల్లో తప్పని సరి అయితే తప్ప మళ్లీ సిగరెట్‌ ముట్టనని గట్టిగా చెబుతున్నాడు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top