మహేష్ కి ముంబాయిలో ఏం పని?

సూపర్ స్టార్ మహేష్ కి హైదరాబాద్ లో విలాసవంతమైన భవనం ఉంది.మన తెలుగు హీరోల్లందరిలోను మహేష్ దే ఖరీదైన ఇల్లు .

 Mahesh Bought A New Flat In Mumbai-TeluguStop.com

ఒకప్పుడు నానక్ రామ్ గూడాలో ఉన్న మహేష్ పెళ్ళైన కొన్నాళ్ళకు ఫిలిమ్ నగర్ లో ఇల్లు కట్టుకున్నాడు.

అయితే తాజా సమాచారం ఏమిటంటే, మహేష్ ముంబాయిలో కొత్త ఫ్లాట్ కొనుక్కున్నాడట.

సల్మాన్ ఖాన్ స్నేహితులు నిర్మించిన ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ లో సొంత ఫ్లాట్ ని, చాలా ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నాడని సమాచారం.ఈ కొత్త ఇంటి డిజైన్ ని మహేష్ సతీమణి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారట.

పనులన్ని అప్పుడే పుర్తి అయ్యాయంట.

అయితే మహేష్ ముంబాయిలో ఇల్లు తీసుకోవడానికి కారణం ఏమిటో తెలియట్లేదు.

మహేష్ భార్యది ముంబాయి కావడం, మురుగదాస్ సినిమా బాలివుడ్ లో కూడా ప్లాన్ చేయడంతో మహేష్ ఇకపై హిందిలో కూడా దృష్టి పెడతాడనే వార్తలకు ఈ కొత్త ఫ్లాట్ మరింత బలాన్ని ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube