మహేష్ ఎకౌంట్ లో మరో ఫిల్మ్ ఫేర్..!

63వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా టాలీవుడ్ నుండి మహేష్ ఆ అవార్డ్ కైవసం చేసుకున్నాడు.శ్రీమంతుడు సినిమాకు గాను ఈ అవార్డ్ మహేష్ కు దక్కింది.

 Mahesh Best Actor 63rd Film Fare Award – 2016-TeluguStop.com

అయితే ఈ మధ్యనే ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసొచ్చిన మహేష్ ఈ అవార్డ్ ఫంక్షన్ కు అటెండ్ అవ్వలేదు.అందుకే అతని తరపున సినిమాకు సంబందించిన ప్రొడ్యూసర్స్ ఈ అవార్డ్ తీసుకున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ అద్భుతమైన నటనతో నాన్ బాహుబలి రికార్డులన్ని తిరగరాశాడు.ఇక ఉత్తమ నటుడు కేటగిరిలో శ్రీమంతుడు మహేష్ తో పాటుగా, బాహుబలి నుండి ప్రభాస్, సన్నాఫ్ సత్యమూర్తి నుండి అల్లు అర్జున్, టెంపర్ నుండి ఎన్టీఆర్, భలే భలే మగాడివోయ్ నుండి నాని నామినేట్ అయ్యారు.

ఫైనల్ గా శ్రీమంతుడు సినిమాకు గాను మహేష్ అవార్డ్ దక్కించుకున్నారు.ఇక నాని భలే భలే మగాడివోయ్ సినిమాకు గాను స్పెషల్ జ్యూరి అందించారు.

ఇక సపోర్టింగ్ రోల్ కు సత్య రాజ్ బాహుబలి, జగపతి బాబు శ్రీమంతుడు, పోసాని కృష్ణమురళి టెంపర్ నుండి పోటీ చేయగా.రుద్రమదేవిలో గమ్మునుండవోయ్ అంటూ సెన్షేషన్ సృష్టించిన అల్లు అర్జున్ అవార్డ్ దక్కించుకున్నారు.

తనకు ఆ పాత్ర ఇచ్చిన గుణశేఖర్ కు కృతజ్ఞతలు చెబుతూ.తెలుగు ప్రేక్షకులందరికి ఆ అవార్డును అంకితం ఇచ్చాడు అల్లు అర్జున్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube