పవన్ గాలి తీసేసిన మహేష్

ఒక్కసారిగా తెలుగు సినిమా బిజినెస్ లెక్కలన్నీ మారిపోయాయి కదా.అపుడెప్పుడో రియల్ ఎస్టేట్ లో బూమ్ వచ్చినట్లు, ఇప్పుడు తెలుగు సినిమా మార్కేట్ బూమ్ వచ్చింది.

 Mahesh Babu Beats Pawan At Tv Market-TeluguStop.com

థియేట్రికల్ రైట్స్, హైర్స్, సాటిలైట్ రైట్స్ .అన్నీట్లో పెరుగుదల కనబడుతుది.ఈ మార్కేట్ GST వచ్చాకే ఇంత పెద్దగా కనబడుతోంది అంటే ఇక అర్థం చేసుకోండి మార్కెట్ స్థాయి ఏమేరకు పెరిగిందో.మొన్నటిదాకా టాప్ హీరో సినిమాలకి సాటిలైట్ హక్కుల ధర 12 కోట్లు చేస్తే గొప్ప అనుకునేవారు.

స్పైడర్ ఆ లెక్కలను మార్చింది.తెలుగు – హిందీ భాషలు కలుపుకోని 26 కోట్లకు అమ్ముడుపోయాయి స్పైడర్ టీవి హక్కులు.

ఇందులో తెలుగు వెర్షన్ ధర 16-17 కోట్లు ఉంటుందేమో.తమిళం, మలయాళ వెర్షన్లు ఇంకా అమ్మనేలేదు.

ఆ రికార్డుని బ్రేక్ చేసాడు పవర్ స్టార్.త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సాటిలైట్ హక్కులు జెమినీ టీవికి 19.50 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.ఈ రికార్డు ఇలా సెట్ అయ్యిందో లేదో అప్పుడే బ్రేక్ అయిపోతోంది.

భరత్ అనే నేనుని మార్కేట్లో 25 కోట్లు చెబుతున్నారట.జెమినీ టీవి 22 కోట్లకి రెడి అంటోంది.

దీంతో అప్పుడే పవన్ గాలి తీసినట్టు అయ్యింది.మరి ఈ రేటుకే నిర్మాతలు ఒప్పుకుంటారో లేక మిగితా ఛానెళ్ళు చెప్పే రేటు కోసం ఆగిచూస్తారో చూడాలి.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది.మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ పొలిటికల్ యాక్షన్ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా కనిపించనుంది.

డివివి దానయ్య నిర్మాతగా కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి కానుకగా భరత్ నేను జనవరి 11, 2018న విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube