చిరంజీవి - పవన్ .. ఇద్దర్ని ఓడించిన మహేష్

ఫ్లాపులు వచ్చినంత మాత్రనా తన క్రేజు, బాక్సాఫీసు స్టామినా ఏమాత్రం తగ్గదని సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి నిరూపించుకున్నాడు.మహేష్ 23వ చిత్రం యొక్క బిజినెస్ బాహుబలి తరువాత ఇదే అన్నట్లుగా జరుగుతోంది.

 Mahesh Babu Beats Both Megastar And Powerstar-TeluguStop.com

ఇప్పటికే సాటిలైట్ రైట్స్ 26 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే (తమిళ హక్కులు కలపకుండా).హిందీ సాటిలైట్ హక్కులకు 8 కోట్లు వేసుకున్నా, మహేష్ తదుపరి సినిమా టీవి హక్కులు తెలుగులో 18 కోట్లకు అమ్ముడుపోయినట్లు.

ఈరకంగా చిరంజీవి ఖైదీనం ,150, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రాలను 6 కోట్ల తేడాతో ఓడించిన ప్రిన్స్, ఇప్పుడు మరోచోట ఇద్దరు మెగాబ్రదర్స్ కి ఎసరు పెట్టాడు.

మహేష్ 23 కృష్ణ జిల్లా హక్కులు ఏకంగా 5.50 కోట్లకు అమ్ముడుపోయాయి.ఇదో సరికొత్త రికార్డు.ఇదే ఏరియాలో ఖైదీనం 150 4.60 కోట్లకు అమ్ముడుపోగా, కాటమరాయుడు 4.50 కోట్లతో మూడొవస్థానంలో ఉంది.ఇక్కడ కోటి తేడాతో ఇటు మెగాస్టార్, అటు పవర్ స్టార్ ని ఓడించాడు సూపర్ స్టార్.

ఇక బిజినెస్ ఇప్పుడే మొదలవడంతో, రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో, మళ్ళీ మహేష్ రికార్డులను ఎవరు తిరగరాస్తారో (బాహుబలిని మినహాయించి) చూడాలి.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబధించి స్పైడర్, సంభవామి అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

రకుల్ ప్రీత్ మహేష్ కి జంటగా నటిస్తుండగా, ఈ తెలుగు – తమిళ ద్విభాష చిత్రాన్ని భారి ఎత్తున ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఊగాది కానుకగా ఫస్ట్ లుక్ రానుండగా, జూన్ 23వ తేదిన, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మళయాళం మరియు హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube