సినిమా హిట్ అయితే ఫర్వాలేదు కాని, పొరపాటులో ఫ్లాప్ అయితే మాత్రం అందరి బాణాలు డైరెక్టర్ వైపే మళ్ళుతాయి.అన్నిటికన్నా ముందుగా డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ లో తీయలేదని, అనవసర ఖర్చులు పెట్టించాడనే గుసగుసలు మొదలుపెడతారు.
ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే మహేష్ బాబు – మురుగదాస్ సినిమా బడ్జెట్ బాగానే అవుతోందట.
యాక్షన్ సన్నివేశాలు భారి ఎత్తున, భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.
ఒక్కో సన్నివేశానికి కోట్ల ఖర్చు పెడుతున్నారు.ఆ సన్నివేశాలు కథలో భాగం కాబట్టి నో ప్రాబ్లెం.
అయితే ఫస్ట్ లుక్ టీజర్ కోసం ప్రత్యేకంగా ఓ వీడియో షూట్ చేశారని అప్పట్లో అన్నారు.అంతేకాదు, సంక్రాంతి నుంచి ఊపందుకునే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోలు షూట్ చేస్తారట.
ఇవి కథలో భాగం కాదని, కేవలం ప్రమోషన్స్ కోసమే అని టాక్.ఆ ప్రమోషన్స్ జనాలకి నచ్చి సినిమా మీద అంచనాలకి ఉపయోగపడితే ఓకే కాని, ఆ వీడియోలు మాత్రం ఫేయిల్ అయితే మురుగదాస్ మీదే అందరి కన్ను పడుతుంది.
అంత ఖర్చు మహేష్ ఎలా పెట్టనిచ్చాడు అని మహేష్ మీద కూడా కామెంట్స్ వినిపిస్తాయి.
చూద్దాం .దీపావళికి వచ్చే ఫస్ట్ లుక్ ఎంతోకొంత ఈ సినిమా గురించి తెలిసిపోతుందిగా.అప్పుడైతే ఓ అంచనాకి రావొచ్చు, మురుగదాస్ అనవసరపు ఖర్చులు పెట్టిస్తున్నాడో లేక అవసరమైన ఖర్చే పెట్టిస్తున్నాడో!
.