అంత ఖర్చెందుకు మహేష్ బాబు-Unnecessary Budget For Mahesh Babu – ARM Film ? 3 months

Diwali First Look Mahesh Babu Movie Budget Promotions Teaser Unnecessary For - Arm Film ? Photo,Image,Pics-

సినిమా హిట్ అయితే ఫర్వాలేదు కాని, పొరపాటులో ఫ్లాప్ అయితే మాత్రం అందరి బాణాలు డైరెక్టర్ వైపే మళ్ళుతాయి. అన్నిటికన్నా ముందుగా డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ లో తీయలేదని, అనవసర ఖర్చులు పెట్టించాడనే గుసగుసలు మొదలుపెడతారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే మహేష్ బాబు – మురుగదాస్ సినిమా బడ్జెట్ బాగానే అవుతోందట.

యాక్షన్ సన్నివేశాలు భారి ఎత్తున, భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఒక్కో సన్నివేశానికి కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఆ సన్నివేశాలు కథలో భాగం కాబట్టి నో ప్రాబ్లెం. అయితే ఫస్ట్ లుక్ టీజర్ కోసం ప్రత్యేకంగా ఓ వీడియో షూట్ చేశారని అప్పట్లో అన్నారు. అంతేకాదు, సంక్రాంతి నుంచి ఊపందుకునే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోలు షూట్ చేస్తారట. ఇవి కథలో భాగం కాదని, కేవలం ప్రమోషన్స్ కోసమే అని టాక్. ఆ ప్రమోషన్స్ జనాలకి నచ్చి సినిమా మీద అంచనాలకి ఉపయోగపడితే ఓకే కాని, ఆ వీడియోలు మాత్రం ఫేయిల్ అయితే మురుగదాస్ మీదే అందరి కన్ను పడుతుంది. అంత ఖర్చు మహేష్ ఎలా పెట్టనిచ్చాడు అని మహేష్ మీద కూడా కామెంట్స్ వినిపిస్తాయి.

చూద్దాం .. దీపావళికి వచ్చే ఫస్ట్ లుక్ ఎంతోకొంత ఈ సినిమా గురించి తెలిసిపోతుందిగా. అప్పుడైతే ఓ అంచనాకి రావొచ్చు, మురుగదాస్ అనవసరపు ఖర్చులు పెట్టిస్తున్నాడో లేక అవసరమైన ఖర్చే పెట్టిస్తున్నాడో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పాపం త్రిషని ముప్పుతిప్పలు పెట్టారుగా

About This Post..అంత ఖర్చెందుకు మహేష్ బాబు

This Post provides detail information about అంత ఖర్చెందుకు మహేష్ బాబు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Unnecessary budget for Mahesh Babu - ARM film ?, Mahesh Babu, AR Murugadoss, Diwali, First Look, Mahesh Movie Budget, Promotions Teaser

Tagged with:Unnecessary budget for Mahesh Babu - ARM film ?, Mahesh Babu, AR Murugadoss, Diwali, First Look, Mahesh Movie Budget, Promotions Teaserar murugadoss,diwali,first look,Mahesh Babu,Mahesh Movie Budget,Promotions Teaser,Unnecessary budget for Mahesh Babu - ARM film ?,,